రాష్ట్రీయం

నోట్ల రద్దు మహాయజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: దేశ ప్రజల జీవనాన్ని దెబ్బతీస్తున్న నల్లధనం, టెర్రరిజం, స్మగ్లింగ్‌లో ఆరితేరిన వారు ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థలను నడుపుతున్నారని, దాన్ని అరికట్టేందుకే ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు అనే మహాయజ్ఞాన్ని చేస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ మహాయజ్ఞంతో ప్రధాని దేశ దశదిశను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి, ఐటిసి సంయుక్త్ధ్వార్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2017పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ తాను దేశాన్ని పాలించేందుకు రాలేదని, బాగుచేసేందుకు వచ్చానని మోదీ చెప్పిన మాటలను గుర్తుచేశారు. పెద్దనోట్లు రద్దు చేసిన తర్వాత నగదు విత్‌డ్రా, చిల్లర కోసం ప్రజలు అనేక అవస్థలు పడుతున్నా, తాత్కాలిక కష్టం.. దీర్ఘకాలిక లాభం కోసమేనన్న అచంచలమైన విశ్వాసం ప్రజల్లో ఉన్నందునే వారు మోదీకి అండగా నిలబడ్డారన్నారు. పెద్దనోట్ల రద్దుతో కేవలం మూడురోజుల వ్యవధిలోనే జిహెచ్‌ఎంసికి రూ. 247 కోట్ల ఆదాయం సమకూరిందంటే ఈ రకంగా ఎంత మంది పన్నులు ఎగ్గొడుతున్నారో అంచనా వేసుకోవచ్చునని వివరించారు. ప్రభుత్వం ప్రకటించే ప్రయోజనాలు నేరుగా సామాన్యులకు అందాలన్న సంకల్పంతోనే ఖాతా నుంచి ఖాతాకు లావాదేవీలను మోదీ ప్రవేశపెట్టారని వివరించారు. అందుకే ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాల, ఆధార్ అనుసంధానం, మొబైల్ యాప్‌ల ద్వారా నగదు రహిత సేవలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అందరూ తమ అవసరాలకు తగిన విధంగా ప్రీపెయిడ్ కార్డులను వాడటం అలవాటు చేసుకుంటే, తద్వారా ఖాతా నుంచి ఖాతాకు లావాదేవీలు జరిగి అసలు అవినీతి అనేది లేకుండా పోతుందని వివరించారు. ప్రధాని చేస్తున్న ప్రయత్నం ఫలించి మున్ముందు కేంద్రం ఇచ్చే అన్ని రకాల రుణాలపై వడ్డీ తగ్గుతుందని ఆకాంక్షించిన వెంకయ్య దేశం సుభిక్షంగా మారి అందరికి వైద్యం, విద్య ఉచితంగా అందుబాటులోకి వచ్చే అవకాశాల్లేకపోలేదని వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దును కొందరు నేతలు తమ ఓటు బ్యాంకు గల్లంతవుతుందనే భయంతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కాని తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ఎందుకు మోదీని విమర్శించటం లేదని కొందరు ఆలోచిస్తున్నారని, అభివృద్ధి ఆకాంక్షించే ఈ రెండు పార్టీలు పరస్పర సహకారంతో ముందుకెళ్తున్నాయని ఆయన వివరించారు.
త్వరలో టాయిలెట్లపై ప్రత్యేక చట్టం
బహిరంగ మలమూత్ర విసర్జన మంచిది కాదని, దుబారా ఖర్చులు మానుకుని ఇంట్లోనే మరుగుదొడ్లను నిర్మించి ఉపయోగించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేగాక, పట్టణ ప్రాంతాల్లోని పెట్రోలు బంకుల్లో మరుగుదొడ్లు ఉన్నా, వాటిని కేవలం అక్కడ పనిచేసే వారు, పెట్రోలు, డీజిల్ పోయించుకునే వారు మాత్రమే వినియోగించుకుంటున్నారని వివరిస్తూ, వాటిని అందరూ వినియోగించుకునేలా బంకుల యజమానులు చర్యలు తీసుకోవాలని, ఇందుకు త్వరలోనే ఓ ప్రత్యేక చట్టం రానున్నట్లు మంత్రి వెల్లడించారు.

చిత్రం..స్వచ్ఛ సర్వేక్షణ్ సభలో మాట్లాడుతున్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు