రాష్ట్రీయం

కాంట్రాక్టు లెక్చరర్లకు కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: తెలంగాణ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచింది. ఈమేరకు ప్రభుత్వం శనివారం జీవో 409 ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఒప్పంద అధ్యాపకులకు 18వేల రూపాయిలు చెల్లిస్తుండగా, దానిని 27 వేల రూపాయిలకు పెంచారు. పెంచిన వేతనాలు ఈనెల నుండే అమలవుతాయని కూడా ప్రభుత్వం పేర్కొంది. తొలుత వీరిని 2000 సంవత్సరంలో జీవో 143 ద్వారా పట్టణ ప్రాంతాల్లో 4 వేల రూపాయిలకు, గిరిజన ప్రాంతాల్లో ఐదు వేల రూపాయిలకు నియమించారు. తర్వాత వీరి వేతనాలను 2011లో జీవో 187 ద్వారా 18వేల రూపాయిలకు పెంచారు. ఈ ఉత్తర్వులతో రాష్ట్రంలో 3687 మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరింత బలోపేతం అవుతాయని ఆయన వ్యాఖ్యానించారు.