రాష్ట్రీయం

అందని ద్రాక్షగా ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: ఆరోగ్యం అందని ద్రాక్షగా మారిందని, వైద్య ఆరోగ్య రంగంలో సహకార వ్యవస్థ రావలసిన అవసరం ఉందని భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఆరోగ్య రక్షణ కేవలం ప్రభుత్వంపైనే వేస్తే సరిపోదని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని మహిళా దక్షత సమితి స్థాపించిన బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆరోగ్య సంబంధిత వౌలిక సదుపాయాల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ఒకే ఒక దీర్ఘకాలిక పరిష్కారం కనుక్కోవల్సి ఉందని పేర్కొంటూ పౌర సమాజంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంబంధీకులు అందరితో కూడిన సహకార వ్యవస్థల నిర్మాణం జరగాలని సూచించారు. నిజానికి ఆరోగ్యం, విద్య, జీవనోపాధి వంటి అభివృద్ధిదాయక లక్ష్యాలను ప్రభుత్వం ఒక్కటే సాధించలేదని, సహకార వ్యవస్థల ఏర్పాటు ద్వారా మాత్రమే ఆ లక్ష్యాలను సాధించగలుగుతామని రాష్టప్రతి చెప్పారు.
మన దేశంలో దాదాపుగా 2.4 మిలియన్‌ల నర్సుల లోటు ఉందని, 2009లో 1.65 మిలియన్ మంది నర్సులు ఉండగా, 2015 నాటికి ఆ సంఖ్య 1.56 మిలియన్‌కు పడిపోయిందని ఆయన అన్నారు. ఇది కలత చెందాల్సిన ధోరణిని సూచిస్తోందని ఆయన చెప్పారు. అదే సమయంలో మన వౌలిక సదుపాయాలను పరిశీలించినా కూడా 5వేల పట్టణాలు, 6.4 లక్షల గ్రామాల్లో 130 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఇంత మందికి 1.53 లక్షల సబ్ సెంటర్లు, 85వేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇంచుమించు 5వేల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వం ఒక్కటే కృషి చేసే బదులు స్టేక్ హోల్డర్లు అందరూ ప్రాతినిధ్యం వహించగలిగిన నమూనాల వైపు చూడటం అత్యవసరమని రాష్టప్రతి సూచించారు.
మహిళా సాధికారత దిశగా మహిళా దక్షత సమితి పోషిస్తున్న ప్రముఖ పాత్రను రాష్టప్రతి ప్రశంసించారు. సుమన్ కృష్ణకాంత్, ప్రమీలా దండావతే మరియు గోవా గవర్నర్ మృదుల సిన్హా వంటి సమితి వ్యవస్థాపక సభ్యుల సేవలను రాష్టప్రతి గుర్తుచేశారు. విద్య, ఆర్థిక స్వీయ ఆధీనతలను ప్రోత్సహించడం, వ్యక్తులకు వారి సంపూర్ణ సామర్ధ్యాన్ని ఆవిష్కరించగలిగేటటువంటి అవకాశాలను కల్పించడం ద్వారా మాత్రమే మహిళల సిసలైన సాధికారత సాధ్యపడుతుందని ఆయన చెప్పారు. భారతదేశంలో మొత్తం మీద సగటు అక్షరాస్యత 74 శాతం ఉండగా , మహిళలకు సంబంధించినంత వరకూ అక్షరాస్యత 65 శాతం కన్నా తక్కువగా ఉండటం దురదృష్టకరమేనని అన్నారు. మహిళల సాధికారతను కట్టబెట్టని సమాజం పరాజిత సమాజంగా మిగులుతుందని ఆయన స్పష్టం చేస్తూ, మహిళలకు సాధికారత దిశగా చేసే ప్రయత్నాలను పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్టగ్రవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ , ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలి, ఎంపి కె విశే్వశ్వరరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు షీతల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. హైదరాబాద్‌లోని మహిళా దక్షత సమితి స్థాపించిన బన్సీలాల్ మలానీ కాలేజీ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రణబ్