రాష్ట్రీయం

జయహో కూచిపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), డిసెంబర్ 25:కూచిపూడి నృత్యం ప్రపంచంలోని అన్ని కళలలో అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నాట్యాన్ని నేర్చుకునేందుకు ప్రపంచం నలుమూలల నుండి ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు ఇక్కడి వస్తుండటం గర్వకారణమన్నారు. కూచిపూడికి మరింత వైభవం తెచ్చే క్రమంలో అన్ని పాఠశాలల్లో కూచిపూడి నాట్యాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయుక్తంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఐదవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని మూడు రోజులపాటు నిర్వహించారు. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమానికి తన మనవడు దేవాన్ష్‌తో కలిసి హాజరైన సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచ రికార్డు నెలకొల్పిన కూచిపూడి నృత్యం గురించి ఇక ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. కూచిపూడి నాట్యాచార్యులకు తగిన గుర్తింపు ఇవ్వడంతోపాటు వారికి 12 వేల రూపాయల వేతనంతో ఉద్యోగమిచ్చి వారి సేవలను వినియోగించుకుంటామన్నారు. సిద్ధేంద్రయోగి కళా క్షేత్రాన్ని ఇక నుంచి కూచిపూడి నాట్యారామం ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. సిద్ధేంద్రయోగి ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి పిహెచ్‌డి స్థాయి వరకు విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ యక్షగాన కళాకారుడు పసుపర్తి రత్తయ్యకు చంద్రబాబు ప్రభుత్వం తరఫున ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
మరో ముఖ్య అతిథి, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ జాతి జీవనానికి ఆధారమయిన కళలను ఎప్పటికీ మరవకూడదని, అది మరచిననాడు అంతా నిస్తేజం అవుతుందని అభిప్రాయపడ్డారు. సాంకేతికత విస్తరిస్తున్న తరుణంలో ప్రపంచం మొత్తం ఆధ్యాత్మికత కోసం ప్రస్తుతం భారత్ వైపే చూస్తోందన్నారు.
ప్రదర్శన అదుర్స్
విజయవాడ, డిసెంబర్ 25:ఐదవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో 17 దేశాల నుంచి 6117 మంది నాట్యకళాకారులు ప్రదర్శించిన ‘జయహో కూచిపూడి’ నాట్య ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు, కూచిపూడి నాట్యారామం చైర్మన్ కూచిపూడి ఆనంద్ ఆధ్వర్యంలో కళాకారులు సుమారు 11 నిమిషాల పాటు కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు. అనంతరం శివుడి ఆనందతాండవాన్ని 19 నిముషాల పాటు ప్రదర్శించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రుషికేష్ ప్రదర్శనను ఆద్యంతం తిలకించి, వరల్డ్ రికార్డు నమోదు అయినట్లు అధికారికంగా ప్రకటించి, అవార్డును ముఖ్యమంత్రికి అందించారు. ప్రకటన అనంతరం కూచిపూడి నాట్యాచార్యులు, కళాకారులు, తల్లిదండ్రులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేశారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, మండలి బుద్ధప్రసాద్, మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును చంద్రబాబుకు అందజేస్తున్న దృశ్యం