రాష్ట్రీయం

హైవేలపై మద్యం షాపులకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: మద్యం షాపులు జాతీయ రహదారులకు 500 మీటర్లలోపు ఉండరాదన్న సుప్రీంకోర్టు తీర్పుతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మద్యం సిండికేట్లు, ప్రభుత్వ అధికారులు విలవిలలాడుతున్నారు. రెండు రాష్ట్రాల మద్యం ఆదాయంపై గంపెడాశను పెట్టుకుని జనరంజక పథకాలను అమలు చేస్తున్న విషయం విదితమే. ఆంధ్రాలో డిసెంబర్ నెలాఖరుతో పాతమద్యం పాలసీ ముగుస్తుంది. దీంతో వచ్చే ఏడాది మార్చి వరకు ఈ పాలసీని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణలో కొత్త మద్యం పాలసీని ఇటీవల వచ్చే రెండేళ్లకు ప్రకటించారు. ప్రతి త్రైమాసిక కాలానికి మద్యం షాపులు, బార్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. హైవేలకు ఆనుకుని ఉన్న షాపులను తొలగిస్తే ఫీజు రాదు. పైగా మద్యం అమ్మకాలు తగ్గి ఆదాయం పడిపోతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1730 బార్లు, 4300 మద్యం షాపులు ఉన్నాయి. 80 శాతం షాపులు జాతీయ రహదారికి దగ్గర్లోనే ఉన్నాయి. 60 శాతం బార్లు కూడా హైవేలకు సమీపంలోనే ఉన్నాయి. రాష్ట్ర ఖజానాకు సాలీనా మద్యం ద్వారా రూ.12000 కోట్ల ఆదాయం వస్తోంది. ముందు అనుకున్నట్లుగా జనవరి 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రావాలి. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తే హైవేల వెంట ఉన్న మద్యం షాపులను మూసివేయాల్సి ఉంటుంది. ఆంధ్రాలో తొమ్మిది జిల్లాల ద్వారా జాతీయ రహదారి వెళుతుంది. శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు జాతీయ రహదారి పరిసరాల్లోని ఎక్కువ సంఖ్యలో బార్లు, వైన్ షాపులున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు జిల్లాలో వీటి సంఖ్య ఎక్కువే. వచ్చే మార్చిలోపల తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని సుప్రీం కోర్టు కరాఖండిగా ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో వచ్చే ఏప్రిల్‌కు కొత్త పాలసీని ప్రకటించే యోచనలో ఏపి ప్రభుత్వం ఉంది. వచ్చే మారి 31వరకు ఇవే మద్యం షాపులను కొనసాగించి ఫీజులను కట్టించుకునేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తును ప్రారంభించింది.
తెలంగాణలోనూ ఇక్కట్లే
సుప్రీం కోర్టు తీర్పును తెలంగాణ ఎక్సైజ్ శాఖ అమలు చేస్తే రాష్ట్రంలో 425 బార్లు, 1450 మద్యం షాపులను మూసివేయాల్సి ఉంటుంది. తెలంగాణలో 815 బార్లు, 2143 మద్యం షాపులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి మూడు నెలలకోసారి మద్యం షాపులు నిర్దేశించిన ఫీజును ప్రభుత్వానికి చెల్లిస్తాయి. గత అక్టోబర్‌లోనే లైసెన్సులను ప్రభుత్వం పునరుద్ధరించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటిస్తే 425 బార్లు, 1450 మద్యం షాపులను మూసివేయాల్సి ఉంటుంది. ఆరువేల కోట్ల రూపాయలకు పైగా ఖజానాకు సొమ్ము రాదు. ఉదాహరణకు జాతీయ రహదారి 44పైనే బోయిన పల్లి నుంచి మేడ్చెల్ వరకు దాదాపు 15 షాపులు, బార్లు ఉన్నాయి. ఈ షాపులను ప్రస్తుతం హైవే నుంచి 500 మీటర్లకు ఆవల మార్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం సిండికేట్లను కోరుతున్నాయి. 500 మీటర్లులోపు, బయట కూడా కాలనీలు ఉన్నాయి. అక్కడ మద్యంషాపులను ఏర్పాటు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయడం మినహా మరో మార్గం లేదని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.