రాష్ట్రీయం

జోనల్ వ్యవస్థ జోలికి వస్తే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: ఉద్యోగ నియామకాల్లో జోనల్ విధానాన్ని రద్దు చేయడం తగదని, దీని వల్ల తీవ్రపరిణామాలు తలెత్తుతాయని కాంగ్రెస్, టిడిపి,సిపిఐ, తెలంగాణ జాక్ హెచ్చరించాయి. టిడిపి ఎమ్మెల్యే, జాతీయ బిసి సంక్షేమ సంఘం చైర్మన్ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, ఉద్యోగ నియామకాల్లో జోనల్ విధానం రద్దు చేయడం తగదని, దీని వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్ధులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఒక వైపుఅసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఎవరితో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ప్రకటించడం సరికాదన్నారు. 15లక్షల నిరుద్యోగులకు సంబంధించిన అంశంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాల పునర్విభజన వల్ల కొత్త సమస్యలు వస్తాయన్నారు. జోనల్ విధానం రద్దు వల్ల కొత్త ఉద్యోగాల భర్తీ ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రావణ్ దాసోజు మాట్లాడుతూ కెసిఆర్ అనాలోచితంగా జోనల్ రద్దును ప్రతిపాదిస్తున్నారని, దీని వల్ల తెలంగాణ సమాజంలో అశాంతి ఏర్పడుతుందన్నారు. నల్లగొండ జిల్లా, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో వేరువేరు సామాజిక, ఆర్థిక పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. జోనల్ విధానాన్ని రద్దు చేయడం వల్ల అభివృద్ధి చెందిన ప్రాంతాల అభ్యర్ధులకే ఉద్యోగాలు దక్కుతాయని, వారితో వెనకబడిన జిల్లాల అభ్యర్థులు పోటీపడలేరన్నారు. పైగా 371డికి పార్లమెంటు సవరణ చేయాల్సి ఉందన్నారు. రాజ్యాంగ సవరణ లేకుండా సాధ్యం కాదన్నారు. అన్ని పార్టీలతో మాట్లాడకుండా, ఏకపక్ష నిర్ణయాలతో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే విపరీతమైన పరిస్ధితులు నెలకొని ఉంటాయన్నారు. తెలంగాణ జాక్ కన్వీనర్ కోదండరామ్ కూడా జోనల్ విధానం రద్దు తగదన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ జోనల్ వ్యవస్థను రద్దుచేసే ప్రతిపాదన తగదని, నిరుద్యోగ యువకులకు శరాఘాతంగా పరిణమిస్తుందన్నారు. 371డి అనుసరించి రాష్టప్రతి ఉత్తర్వులకు లోబడి ఉమ్మడి రాష్ట్రాన్ని ఆరుజోన్లుగా విభజించారన్నారు. తెలంగాణలో రెండు జోన్లు ఉన్నాయన్నారు. ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.