రాష్ట్రీయం

శక్తిమంత భారతమే కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), డిసెంబర్ 25: శక్తివంతమైన, శాంతి పూరితమైన భవిష్య భారతావని తీర్చిదిద్దడమే అందరి ముందున్న కర్తవ్యమని ఆధ్యాత్మిక గురువు భగవాన్ విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. విశాఖలో ఆదివారం జరిగిన అర్చక సదస్సులో ఆయన మాట్లాడారు. మనిషి హృదయం లబ్‌డబ్‌మంటూ స్పందించిన విధంగానే భారత మాత ప్రేమ, శాంతి కోసం తపిస్తోందన్నారు. భౌతిక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక శక్తుల్ని సాధించి గురు స్థానానికి తీసుకువెళ్లే అవకాశం యోగా గొప్పలక్షణమని అన్నారు. అటువంటి అంశాలను ప్రపంచానికి చాటేందుకు ప్రధాని మోదీ ఒక ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సనాతన ధర్మానికి యోగశాస్త్రానికి అవినాభావ సంబంధం ఉందని, దీన్ని విస్మరించరాదని విశ్వంజీ అన్నారు. భారతదేశంలో పుట్టి, పెరిగి, విద్యాభ్యాసం పూర్తి చేసుకుని విదేశాల్లో స్థిరపడుతున్న ప్రవాస భారతీయులను స్వదేశానికి రప్పించే బృహత్ కార్యక్రమం మేకిన్ ఇండియాలో భాగమని అన్నారు. విశ్వశాంతి కోరేవారు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, సడలని మనోధైర్యంతో ముందుకు సాగవచ్చని పేర్కొన్నారు. సమాజానికి, దైవానికి మధ్య వారధి లాంటివారే అర్చకులని, రోగం వస్తే వైద్యుని వద్దకు వెళ్లి జబ్బు నయం చేయించుకుంటున్నాం. అలాగే అర్చకులు ప్రజల బాధలను తొలగించేందుకు తమ మంత్ర, ఆధ్యాత్మిక శక్తితో భగవంతుని ప్రార్థిస్తారన్నారు. అంతకుముందు విశ్వంజీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చిత్రాలు..విశాఖపట్నంలో ఆదివారం జరిగిన అర్చక సదస్సులో ప్రసంగిస్తున్న ఆధ్యాత్మిక గురువు భగవాన్ విశ్వయోగి విశ్వంజీ