రాష్ట్రీయం

కరడుగట్టిన నేరస్థుడు అయూబ్‌ఖాన్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26:హైదరాబాద్ పాతబస్తీకి చెందిన కరడుగట్టిన రౌడీషీటర్ అయూబ్‌ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గతంలో పోలీస్ కాల్పుల్లో గాయపడిన అయూబ్‌ఖాన్ పదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. కాగా ఆదివారం సాయంత్రం ముంబయి శివార్లలో మహారాష్ట్ర పోలీసులు ఆదివారం సాయంత్రం అతనిని అదుపులోకి తీసుకుని తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయూబ్‌ఖాన్‌ను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు సోమవారం సౌత్‌జోన్ పోలీస్ బృందం ముంబయికి బయలుదేరినట్టు దక్షిణ మండలానికి చెందిన ఓ సీనియర్ టాస్క్ఫోర్స్ అధికారి తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎనిమిది హత్య కేసులతోపాటు 27 బెదిరింపు కేసులు, ఓ హత్యాయత్నం కేసుసహా పలు దోపిడీ కేసుల్లో అతను నిందితుడు. నగర పోలీసులు గత ఏడాది అయూబ్‌ఖాన్‌పై ‘లుక్ అవుట్’ నోటీసు కూడా జారీ చేశారు. 2002లో న్యాయవాది మన్నన్ ఘోరీని పట్టపగలే హత్య చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. అప్పట్లో అరెస్టయిన అయూబ్‌ఖాన్ 2005లో బెయిల్‌పై బయటకువచ్చి తన ఆగడాల్ని కొనసాగించాడు. గతంలో మూడుసార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. 2006లో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరపడంతో అతడి కాలికి గామైంది. చివరిసారిగా 2008లో కర్ణాటకలోని గుల్బర్గాలో ఓ రహస్య స్థావరంపై నగర పోలీసులు దాడి చేసి పట్టుకొచ్చారు. అనంతరం న్యాయవాది మన్నన్ ఘోరీ హత్య కేసులో సాక్షులను అంతమొందించేందుకు ప్రయత్నించాడు. రెండేళ్ల కిందట దుబాయికి పారిపోయాడు. అక్కడినుంచి విమానంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఉంది. రెండు పాస్‌పోర్టులు కలిగివున్న అయూబ్ ఖాన్ ముంబయి మీదుగా హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు. ఇదిలావుండగా అయూబ్‌ఖాన్ ముంబయి పోలీసుల అదుపులోనే ఉన్నట్టు ప్రచారం జరుగుతోందని, వాస్తవాలపై ఆరా తీసి, ఒక వేళ నిజమే అయితే అయూబ్‌ఖాన్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తామని సౌత్‌జోన్‌కు చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్‌ను టాస్క్ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ముంబయిలో అరెస్టయిన అయూబ్‌ఖాన్‌ను తెలంగాణ పోలీసులు తమ అధీనంలో తీసుకున్నట్టు తెలిసింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఖాన్ నేరాలపై విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.