రాష్ట్రీయం

మోరి..ఫైబర్ భేరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, డిసెంబర్ 27: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపాడు రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ గ్రామాలు కానున్నాయి. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌ను గురువారంనాడు సిఎం చంద్రబాబు ఈ గ్రామాల్లో ప్రారంభించనున్నారు. నిన్నమొన్నటి వరకూ ఈ గ్రామాల గురించి తెలిసినవారు తక్కువమంది మాత్రమే. ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటు కానుండటంతో ఈ గ్రామాల పేర్లు రాష్టవ్య్రాప్తంగా మార్మోగిపోతున్నాయి. రూ.149లకే ఈగ్రామాల్లో కేబుల్ టివి, ఇంటర్నెట్, ల్యాండ్ ఫోను సౌకర్యాలను అందించనున్నారు. ఈ జంట గ్రామాల్లో సుమారు 15 వేల జనాభా ఉన్నారు. ఆయా గ్రామాల్లో 864 మంది డ్వాక్రా సంఘాల సభ్యులు ఉండగా వారందరికీ డిజిటల్ లావాదేవీల నిర్వహణపై శిక్షణ ఇచ్చి ఇప్పటికే స్మార్ట్ఫోన్లు అందించారు. అలాగే 1200 ఫైబర్‌గ్రిడ్ కనెక్షన్లను ఏర్పాటు చేశారు. తొమ్మిది వైఫై కేంద్రాలను నెలకొల్పారు. ఈ గ్రామాల్లోని చిన్న వ్యాపారులు, జీడిపప్పు వ్యాపారులు, చేనేత, ఆక్వా వ్యాపారులకు స్వైపింగ్ యంత్రాలతోపాటు పేటిఎంపై అవగాహన కల్పిస్తున్నారు. చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని రెండు గ్రామాల్లో ఆయన ఇంటింటికీ తిరిగే అవకాశం ఉన్నందున అధికారులు రూట్‌మ్యాప్‌ను కూడా తయారుచేశారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లలో తలమునకలై ఉంది. రూ. 3కోట్లతో 19 రహదారులను అభివృద్ధి చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్‌వర్క్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి కృష్ణ ఈగ్రామాల్లో పర్యటించి డిజిటలైజేషన్ పనులను పరిశీలించారు.
నాసాతో అనుసంధానం
మోరి రివర్‌సైడ్ పాఠశాల, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇకపై నాసా కేంద్రంతో నేరుగా సంభాషించేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటుచేశారు. ఈ ఘనత దక్కించుకున్న గ్రామాలుగా మోరి, మోరిపాడు రికార్డు సృష్టించనున్నాయి. ఇక్కడ విద్యార్థులు తమకు అవసరమైన సమాచారాన్ని నాసా సహకారంతో పొందే వీలుంటుందని అమెరికాకు చెందిన బర్కిలీ విశ్వవిద్యాలయం విద్యార్థులు చెబుతున్నారు. వారంతా గత వారం రోజుల నుండి మోరి, మోరిపాడు గ్రామాల్లోనే డిజిటల్ టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.

చిత్రం..మోరి, మోరిపాడు గ్రామాల్లో డిజిటల్ లావాదేవీలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం