రాష్ట్రీయం

కట్టించండి చూద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: రెండున్నరేళ్ల వ్యవధిలో 2.60 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రభుత్వం కట్టిస్తే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పోటీ చేయకుండా, టిఆర్‌ఎస్‌కు మద్దతిస్తుందని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శాసనసభలో సవాల్ విసిరారు. ఈ ప్రకటనను తాను వ్యక్తిగతంగా చేయడం లేదని పిసిసి అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాతే చేస్తున్నానని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణ, నిధులు తదితర కారణాలవల్ల రెండున్నర లక్షల ఇళ్లు నిర్మించడం అసాధ్యమని, వాస్తవ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుకుంటే మహా అయితే 50 వేల ఇళ్లు నిర్మించవచ్చని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే స్పందిస్తూ కోమటిరెడ్డి ఈ ప్రకటన చేయడంద్వారా తన రాజకీయ భవిష్యత్తుకు తానే ఫుల్‌స్టాప్ పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్ల కాలంలో కేవలం 12 వందల ఇళ్లు మాత్రమే నిర్మించిన ప్రభుత్వం రెండున్నర లక్షల ఇళ్లు ఎలా కట్టిస్తుందని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కాగా 12 వందల ఇళ్లు మాత్రమే నిర్మించిన విషయం, టెండర్లలో తలెత్తిన ఇబ్బందులు తాను చెప్పిన విషయమేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అంతకుముందు ఇదే అంశంపై కాంగ్రెస్ సభ్యురాలు డికె అరుణ మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేవలం ముఖ్యమంత్రి దత్తత గ్రామాలలో, మంత్రులు హరీశ్‌రావు, కెటిఆర్ సొంత నియోజకవర్గాలలో తప్ప మరెక్కడా జరగడం లేదని విమర్శించారు. తమ నియోజకవర్గాలలో ఉన్న ప్రజలు తెలంగాణవాళ్లు కాదా? ఆంధ్రవాళ్లు ఏమైనా ఉన్నారా? మరి అలాంటప్పుడు తమ నియోజకవర్గాలపై ఎందుకీ వివక్ష అని ఆమె ప్రశ్నించారు. బిజెపి సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఎంఐఎం పక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసి, టిడిపి సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ఇదే అంశంపై మాట్లాడుతూ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.