రాష్ట్రీయం

ముఖ్యమంత్రి ఇంట్లో 150 గదులున్నట్టు చూపిస్తావా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: ‘ముఖ్యమంత్రి ఇంట్లో 150 గదులు ఉన్నాయా? ఉంటే చూపిస్తావా? ఇంత పేలవంగా సభలో మాట్లాడితే ఎలా? ఇంత అన్యాయంగా, భావదారిద్రంగా మాట్లాడటమా? ఇంటి పనుల్లో పని చేసిన కూలోడ్ని అడిగినా ఎన్ని గదులు ఉన్నాయో చెబుతడు కదా’ అని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డిపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో మంగళవారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ‘అది కెసిఆర్ నివాసం కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం, రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబించే భవనంగా చూడాలి.’ అని ముఖ్యమంత్రి అన్నారు. అంతకుముందు రెండున్నర ఏళ్లలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించలేకపోయారు కానీ 150 గదులతో ఎనిమిది నెలలలో ముఖ్యమంత్రి నివాసాన్ని మాత్రం నిర్మించుకున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందిస్తూ నిజాం ప్రభువు లక్షల ఎకరాలు ఇచ్చివెళ్లారు కానీ ముఖ్యమంత్రి నివాసాన్ని ఎందుకో నిర్మించలేకపోయారన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో సిఎం నివాస భవనాన్ని నిర్మించినప్పటికీ ముఖ్యమంత్రి వాహనం తప్ప కాన్వాయ్ వాహనాలు కూడా రోడ్డ్‌పైనే నిలిచిపోయేలా నిర్మించారని ముఖ్యమంత్రి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఎవరు వచ్చినా సమావేశం పెట్టుకోవడానికి, వారి వాహనాలు నిలపడానికి వీలుగా కొత్త భవనాన్ని నిర్మించినట్టు ముఖ్యమంత్రి వివరించారు.