రాష్ట్రీయం

ఏపిఏటి ఉద్యోగులను విభజించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో పని చేస్తున్న ఉద్యోగులను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించే ప్రక్రియను వచ్చే మూడు నెలల్లో ముగించాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఏపిఏటి సిబ్బంది పంపిన బిల్లులను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించిన విషయమై కె శ్రీనివాస్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. రెండు రాష్ట్రాలు 58, 42 నిష్పత్తిలో సిబ్బందికి వేతనాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్చించాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేదని కోర్టు పేర్కొంది.