రాష్ట్రీయం

అభివృద్ధికి చిరునామా ఆంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), డిసెంబర్ 30: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందాల మధ్య నూతన ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు అన్నారు. ఆయన వీడియో లింక్ రిమోట్ సిస్టం ద్వారా శనివారం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు కార్యాలయం నుంచి రైల్వేశాఖ మంత్రి వీడియో రిమోట్ కంట్రోల్ సిస్టం ద్వారా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రారంభించగా విజయవాడ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లోని ఎ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభోత్సవం చేశారు. ముందుగా నడికుడి - శ్రీకాళహస్తి మధ్య నూతన రైలు మార్గానికి శంకుస్థాపన చేశారు. ఈ మార్గానికి మొదటి విడతగా 2011-12 కాలంలో 309 కిలోమీటర్లకు గాను 2299 కోట్ల రూపాయలు అంచనా వేశారన్నారు. 2016-17 బడ్జెట్‌లో మొదటి విడతగా రూ.180కోట్లు నిధులు విడుదల చేయగా అంతకు ముందు 2015-16 బడ్జెట్‌లో 110 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ లైను మూడు దశలుగా పూర్తవుతుందని ప్రభు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరమైన విజయవాడ రైల్వేస్టేషన్ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి ముఖద్వారంలా పనిచేస్తుందన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో సరికొత్త సిగ్నలింగ్ టెక్నాలజీలతో అధునాతన భవంతిలో ఏర్పాటు చేసిన రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టంను ప్రభు రిమోట్ లింక్ సిస్టం ద్వారా జాతికి అంకితం చేశారు. విజయవాడలోని సత్యనారాయణపురం రైల్వే కాలనీలో నూతనంగా నిర్మించిన ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటరుకు చెందిన హాస్టల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం చిరకాలంగా ప్రయాణికులు ఎదురుచూస్తున్న తిరుపతి - విశాఖపట్నం మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన ఎసి డబుల్ డెక్కర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. తరువాత గుంటూరు జంక్షన్ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన హైస్పీడ్ వైఫైని సురేష్ ప్రభు ప్రారంభించారు. చివరిగా రాయ్‌దుర్గ్ - తుముకూర్ కొత్త రైలుమార్గంలో భాగంగా రాయదుర్గ్ - కల్యాణ దుర్గి మధ్య నలభై కిలోమీటర్ల రైలు మార్గాన్ని పారంభించిన అనంతరం ఈ మార్గంలో ఇప్పటికే రాయదుర్గ్ వరకు నడుస్తున్న ప్యాసింజరు టైన్ నెంబరు 57477 ప్యాసింజర్‌ని కల్యాణదుర్గ వరకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రభు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోభివృద్ధి రాష్టమ్రన్నారు. దేశంలో నెంబర్ వన్‌గా అభివృద్ధి చేయడానికి రైల్వేశాఖ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. రెండు సంవత్సరాల కాలంలో రైల్వే బడ్జెట్‌లో రెట్టింపు, ప్రభుత్వాల ఒప్పందాలతో అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం చంద్రబాబు రైల్వేబోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ అగర్వాల్ మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నూతన ప్రాజెక్టుల అభివృద్ధికి ఒప్పందాల మధ్య సంతకాలు చేసుకున్నారు. తరువాత చంద్రబాబు మాట్లాడుతూ ఏపిలో ఒకే రోజు 6ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందించదగిన విషయమన్నారు. రైలు సర్వీస్‌రంగంలో నూతన అధ్యాయాన్ని లిఖించడానికి దక్షిణ మధ్య రైల్వే రంగం సిద్ధం చేసిందన్నారు. అయితే ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైను నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు వందల కోట్ల నిధులు విడుదల చేయటం జరిగిందన్నారు. ఈ లైను మార్గం ద్వారా అటు ప్రజలకు ఇటు రవాణా శాఖకు ఎంతో దోహదపడుతుందన్నారు. అలాగే మిగిలిన ప్రాజెక్టులు అయిదు కూడా ఒకే రోజు ప్రారంభించడం. అందులో విశాఖపట్నం - తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైలు ప్రయాణికులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కాగా రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ పెండింగ్‌లో ఉందన్న విషయం సురేష్ ప్రభుజీ గుర్తించాలన్నారు. అది విశాఖ జోనని అన్నారు. 2017కు స్వాగతం పలుకుతూ ఆంధ్ర రాష్ట్రంలో జోన్‌ని కూడా ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతున్నామన్నారు.

చిత్రం..డబుల్‌డెక్కర్ రైలును ప్రారంభిస్తున్న చంద్రబాబు