రాష్ట్రీయం

నిష్క్రమణ పరీక్ష ఉత్తీర్ణులైతేనే డాక్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: ఇక డాక్టర్ కావాలంటే మెడిసిన్ పాసయితే చాలదు...జాతీయ నిష్క్రమణ పరీక్ష ( నెక్స్ట్) పాస్ కావాలి. మెడికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అనేక మార్పులు, చేర్పులకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రవేశపెట్టిన 2016 సవరణ బిల్లు ప్రకారం అభ్యర్ధులు ఐదేళ్ల మెడిసిన్ పూర్తయితే సరిపోదని, నేషనల్ ఎగ్జిట్ టెస్టు (నెక్స్ట్ )ను అభ్యర్ధులు పాస్ కావల్సి ఉంటుందని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. ఈ పరీక్ష వల్ల వైద్య విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెక్స్ట్ పరీక్ష మూడు పరీక్షలకు ప్రత్యామ్నాయం అవుతుందని వారు పేర్కొన్నారు. నెక్స్ట్ పరీక్ష మార్కుల ఆధారంగానే పిజి కోర్సుల్లో ప్రవేశాలుంటాయని, కేంద్రప్రభుత్వ సర్వీసుల్లోకి ఈ మార్కుల ఆధారంగానే తీసుకుంటారని, ఫారిన్ గ్రాడ్యూయేట్స్ మెడికల్ ఎగ్జామ్‌కు సైతం నెక్స్ట్ ప్రత్యామ్నాయం అవుతుందని అధికారులు వివరించారు. ముఖ్యంగా నెక్స్ట్ ప్రారంభం అయ్యాక, మెడికల్ కాలేజీల సత్తా ఏమిటో ప్రజలకు తెలుస్తుందని , ఏ కాలేజీలో ఎంత శాతం మంది నెక్స్ట్ పాసయ్యారో బహిరంగంగా మెడికల్ కౌన్సిల్ ప్రకటించనుంది. దాని ఆధారంగానే ఆయా కాలేజీల్లో మెడికల్ ఎడ్యుకేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం చాలా తేలిక అవుతుంది. మెడికల్ కాలేజీల విద్యాప్రమాణాలను నిర్ణయించడానికి ఇదో మంచి కొలబద్ద అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. దేశంలో వివిధ వైద్య విద్యాసంస్థల మధ్య సాధారణీకరణకు ఇది తోడ్పడుతుందని వారు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వేలాది మంది పిజి కోర్సులు పూర్తి చేస్తూన్నా, తిరిగి వారు ప్రభుత్వ సర్వీసుల్లో చేరడం లేదని కేంద్రం గుర్తించింది.