రాష్ట్రీయం

ఆర్‌ఎస్‌ఎస్ నేత కొత్తపల్లి అస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 30: రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ ఎస్ ఎస్) సంఘ్ ద్వితీయ సర్ సంచాలకులు కొత్తపల్లి ఘనశ్యామ్ ప్రసాద్ (85) అస్వస్థతతో గురువారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన స్వస్థలం రాజమహేంద్రవరంలో శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. ఒక కుమారుడు అప్పాజీ రాజమహేంద్రవరంలో ఎల్‌ఐసి డివిజనల్ అధికారిగాను, రెండో కుమారుడు విశాఖలో పెప్సీ సంస్థలోనూ పనిచేస్తున్నారు.
కొత్తపల్లి ఘనశ్యామ్ ప్రసాద్ అమలాపురం ఎస్‌కెబి ఆర్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి పదవీవిరమణ పొందారు. ఆర్‌ఎస్‌ఎస్ సంఘంలో అనేక బాధ్యతలు నిర్వహించారు. మంచి రచయితగా పేరొందిన ఆయన ఎన్నో రచనలు చేశారు. తెలుగులో అనేక దేశభక్తి గీతాలు రాశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎపి సంఘంలో ఆలపించే దేశభక్తి గీతాలన్నీ ఆయన రాసినవే. 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు చేయడంతో 19 మాసాల పాటు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో ప్రతీ రోజూ ఉదయం రేడియోలో ఆయన రాసిన దేశభక్తి గీతాలే ప్రసారమయ్యేవని ఆయన సన్నిహితులు చెప్పారు. దేవాలయాలు-శాస్ర్తియత అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని రచించారు. సంస్కార భారతి అనే సంస్థకు అఖిలభారత అధ్యక్షులుగా పనిచేశారు. రాణీ రుద్రమదేవి, గణపతిదేవుడు ఆస్థానంలో సైనికాధికారులపై ముసునూరి నాయకులు అనే ఒక చారిత్రక పుస్తకాన్ని రచించారు. పోరాట యోధులుగా సామ్రాజ్యాన్ని ఎలా రక్షించాలో అనే విషయాలను ఈ పుస్తకంలో విశేషంగా వివరించడం జరిగింది.
కొత్తపల్లి ఘనశ్యామ్‌తో కాసేపు మాట్లాడితే ఎంతో దేశభక్తి ప్రేరణ కలుగుతుందని సన్నిహితులు చెబుతుంటారు. గురూజీ ఉపన్యాసాలను పాంచజన్యం పేరుతో తెలుగులో అనువదించారు. కొత్తపల్లి మృతికి పలువురు తీవ్ర సంతాపం తెలియజేశారు. తులసి సూర్య ప్రకాశ్, ఓలేటి సత్యనారాయణ, బొమ్ముల దత్తు తదితరులు నివాళులర్పించారు.