రాష్ట్రీయం

ఉమ్మడి ప్రవేశపరీక్షలపై రెండు రోజుల్లో స్పష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశపరీక్షల నిర్వహణకు సంబంధించి కసరత్తు పూర్తయింది, షెడ్యూలును ఒకటి రెండు రోజుల్లో ప్రకటించేందుకు ఉన్నత విద్యామండళ్లు ఏర్పాట్లు చేస్తున్నాయి. గత ఏడాది కంటె చాలా ముందే ఈసారి ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నారు. పలు కారణాలతో ఆంధ్రాలో 2016 ఎమ్సెట్‌ను ఏప్రిల్ 29న నిర్వహించగా, ఈసారి అంతకంటే ముందే నిర్వహించాలని చూస్తున్నారు. అలాగే 2016లో తెలంగాణ ఎమ్సెట్-1ను మే 14న నిర్వహించగా ఈసారి ఏప్రిల్‌లోనే నిర్వహించేందుకు వీలుగా షెడ్యూలు రూపొందిస్తున్నారు. పరీక్షల షెడ్యూలు ప్రకటనకు ముందే కీలకమైన ప్రవేశపరీక్షల కన్వీనర్లతో సమావేశాలను నిర్వహించనున్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి , ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఎంపిక పరీక్షలకు సంబంధించి కసరత్తు పూర్తి చేశాయి. 2016 ప్రవేశపరీక్షలను ఎమ్సెట్‌ను తెలంగాణలో జెఎన్‌టియుహెచ్, ఆంధ్రాలో జెఎన్‌టియు కాకినాడ నిర్వహించాయి. ఐసెట్‌ను కాకతీయ, ఆంధ్రా యూనివర్శిటీలు, ఎడ్‌సెట్‌ను ఉస్మానియా, ఎస్వీయు, ఇసెట్‌ను జెఎన్‌టియుహెచ్, జెఎన్‌టియు అనంతపురం, పిఇసెట్‌ను ఉస్మానియా,జెఎన్‌టియు కాకినాడ, లాసెట్‌ను కాకతీయ , కృష్ణదేవరాయ యూనివర్శిటీలు నిర్వహించాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ ఉస్మానియా, ఆచార్య నాగార్జున యూనివర్శిటీలు నిర్వహించాయి. ప్రవేశపరీక్షల్లో తొలుత ఎమ్సెట్‌ను నిర్వహిస్తున్నారు.