రాష్ట్రీయం

వేతన, ఉద్యోగ భద్రత కల్పించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: కార్మికులకు వేతన, ఉద్యోగ భద్రత కల్పించడంలో కేంద్రప్రభుత్వం ఈ ఏడాది సఫలీకృతం అయ్యిందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్భారత్’ అనే నినాదాన్ని నిజం చేస్తూ ప్రపంచంలోనే భారత్ అగ్రగామి దేశంగా రూపొందేందుకు ప్రధాని నరేంద్రమోదీ అన్ని చర్యలూ తీసుకుంటున్నారని చెప్పారు. శనివారం సాయంత్రం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 2016 విప్లవాత్మక సంవత్సరమని అన్నారు. సర్జికల్‌స్ట్రైక్స్ మొదలు పెద్ద నోట్ల రద్దువరకూ సాహసోపేతమైన నిర్ణయాలు దేశంలో తీసుకోవడమైందని, ఇది మరువలేని సంవత్సరమని అన్నారు.
గుజరాత్ నుండి అస్సాం వరకూ దేశ ప్రజలు అందరినీ ఏకం చేసి ఆలోచింపచేసిందని, శాంతి, సామరస్యం, ప్రజాహితం పరంగా 2016 అందరి మదిలో ఒక మైలు రాయిగా నిలుస్తుందని అన్నారు. 2017 నిర్మాణాత్మక సంవత్సరంగా అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం అంతం చేసే సంవత్సరంగా మారబోతోందని పేర్కొన్నారు. మన అసంఖ్యాక మానవ వనరులు ఒక వరంగా మారేందుకు, డెబ్బై కోట్ల మంది యువతలో నైపుణ్యాభివృద్ధికి ముందడుగు వేయబోతున్నామని పేర్కొన్నారు. రైతులకు ఆదాయం రెట్టింపు చేసే దిశలో చర్యలు చేపట్టడం జరిగిందని, కార్మికులకు కనీస వేతనాలతో పాటు సమాన వేతనాలు దొరికేట్టు చర్యలు తీసుకున్నామని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికులకు సాంఘిక, వేతన, ఉద్యోగ భద్రత లభించే చర్యలు, నాణ్యమైన విద్య, పేదలందరికీ గృహాలు అందించడంలో చర్యలు తీసుకోవడమైందని, వాటిని మరింత సమర్థంగా 2017లో అమలు చేసి తీరుతామని చెప్పారు. కార్మిక శాఖ, దాని అనుబంధ విభాగాల్లో భారీ సంస్కరణలను తీసుకువచ్చామని పేర్కొన్నారు. మోడల్ షాప్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లు ద్వారా సహకార సమాఖ్యల ఏర్పాటుకు వీలు కల్పించామని పేర్కొన్నారు. అలాగే కార్మిక రంగానికి సంబంధించి కార్మిక వేతనాలు, కార్మికులకు పరిశ్రమల సంబంధాలు, కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలను తీసుకోవడమైందని పేర్కొన్నారు.