రాష్ట్రీయం

దుమ్ముకొట్టుకు పోయిన ఎటిఎంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: కరెన్సీతో కళకళలాడిన ఎటిఎంలు ఇప్పుడు దుమ్ముకొట్టుకు పోయి కళావిహీనంగా మారాయి. నవంబర్ 8న కరెన్సీ నోట్ల రద్దును ప్రధానమంత్రి ఏ ముహూర్తాన ప్రకటించారో కానీ అప్పటి నుంచి ఎటిఎంలకు గ్రహణం పట్టినట్టయింది. ఎటిఎంలు చాలా చోట్ల మూసే ఉన్నాయి. డబ్బులు లేకపోయినా పరవాలేదు. తాళం వేయకుండా తెరిచి ఉంచండి అని వౌఖిక ఆదేశాలు రావడంతో కొన్ని చోట్ల ఎటిఎంలు తెరిచి ఉంచారు. కేవలం ఉత్సవ విగ్రహాలుగా కనిపిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట మాత్రమే ఎటిఎంలలలో డబ్బులు పెట్టారు. దాంతో 50 రోజులు గడిచిన తరువాత కూడా అక్కడ భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇక ఎక్కువ ఎటిఎంలు మాత్రం దుమ్ము కొట్టి కనిపిస్తున్నాయి. నవంబర్ ఎనిమిదిన కరెన్సీ రద్దు ప్రకటన రాగానే చాలా మంది ఎటిఎంలకు పరుగులు తీసి వంద నోట్లు తీసుకున్నారు. రాత్రికి రాత్రే ఎటిఎంలు అన్నీ ఖాళీ అయ్యాయి. 90 శాతానికి పైగా ఎటిఎంలు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పని చేయడం లేదు. ఎటిఎంలలో ఔట్ సోర్సింగ్ ద్వారా సెక్యురిటీ వారిని నియమిస్తారు. మొదటి వారం ఎటిఎంలలో డబ్బులు లేకపోయినా తెరిచే ఉంచే వారు. ఆ తరువాత తాళం పడింది. ఇప్పుడు చాలా ఎటిఎంలు మూత పడ్డాయి.
కొన్ని ఎటిఎంలు తెరిచి ఉంచినా సెక్యూరిటీ కనిపించడం లేదు. ఎటిఎంలో డబ్బులు రావడం లేదు. సెక్యూరిటీ సిబ్బందికి ఔట్ సోర్సింగ్ ద్వారా నెల నెలా చెల్లిస్తారు. ఎటిఎంలే పని చేయనప్పుడు నెలల తరబడి సెక్యూరిటీకి చెల్లించడం ఎందుకనుకుని చాలా ఎటిఎంలలో సెక్యూరిటీని తొలగించారు. అయితే కొన్ని ఎటిఎంలలో మాత్రం సెక్యూరిటీ గార్డ్‌లు ఎప్పటి మాదిరిగానే వచ్చి కూర్చోని వెళుతున్నారు. చాలా ఎటిఎంలలో దుమ్ము పేరుకుపోయి ఉంది. స్వచ్ఛ ఎటిఎంలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల ముందు క్యూలు తగ్గిపోయాయి. చాలా స్వల్ప సంఖ్యలోనే ఉంటున్నారు. ఏవో కొద్ది బ్యాంకుల ముందు భారీ క్యూలు తప్పిస్తే అన్ని బ్యాంకుల్లో సాధారణ పరిస్థితులే ఉన్నాయి. వారానికి 24వేల రూపాయలను విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉన్నా, గత వారం వరకు రోజుకు రెండు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు మాత్రమే ఇచ్చే వాళ్లు, ఇప్పుడు ఒకేసారి 24వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా కొన్ని బ్యాంకులు అత్యవసర పని అయితే చెక్ ఇచ్చి 50 వేల రూపాయల వరకూ డ్రా చేసుకోవచ్చునని ఆఫర్ ఇస్తున్నాయి. కార్పొరేట్ బ్యాంకులు ఉదారంగానే డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. క్రమంగా ఎటిఎంలను తగ్గించే అవకాశాలు ఉన్నాయేమో అని ఎటిఎంలకు నిర్వాహణ సేవలు అందించే సంస్థలు అనుమానిస్తున్నాయి.