రాష్ట్రీయం

రేపే సైన్స్ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 1: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి 7.05 గంటలకు తిరుపతికి రానున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. మంగళవారం నుంచి 7వ తేదీ వరకు ఎస్వీ యూనివర్శిటీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు జరగనుంది. ఈ సదస్సును ప్రారంభించడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు స్వాగతం పలికి సదస్సులో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి 7 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి కారులో నేరుగా తిరుపతి పద్మావతి అతిథి భవనం చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 3వ తేదీ మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ముఖ్యమంత్రి అక్కడ ప్రధానికి స్వాగతం పలుకుతారు. రేణిగుంట విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచిన హెలికాప్టర్‌లో ప్రధాని మోదీ, చంద్రబాబు కలిసి నెహ్రూ మునిసిపల్ కళాశాల హెలిపాడ్‌కు 10.50 గంటలకు చేరుకుంటారు. అక్కడనుంచి కారులో 11 గంటలకు ఎస్వీ యూనివర్శిటీ తారకరామా స్టేడియంలో ఏర్పాటుచేసిన ఇస్కా సదస్సు వేదికవద్దకు చేరుకుంటారు. నరేంద్ర మోదీ, చంద్రబాబు మధ్యాహ్నం 1 గంట వరకు సదస్సులో పాల్గొంటారు. అక్కడ నుంచి 1.45 గంటలకు తిరుమల పద్మావతి అతిథిభవనం వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి శ్రీవారి ఆలయానికి బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు స్వామివారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2.50 గంటలకు పద్మావతి అతిథి భవనానికి చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. 3.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి ఢిల్లీ వెళ్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సాయంత్రం ప్రధానికి వీడ్కోలు పలికిన అనంతరం పద్మావతి అతిధిగృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఈ నెల 4 బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరుగనున్న చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రారంభిస్తారు.