రాష్ట్రీయం

కొత్త సిఎస్ ఎస్‌పి సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌పి సింగ్ నియమితులయ్యారు. ప్రదీప్ చంద్ర పదవీ కాలం శనివారంతో ముగియడంత పంచాయితీరాజ్ స్పెషల్ సెక్రటరీగా ఉన్న ఎస్‌పి సింగ్‌ను నూతన ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1983 బ్యాచ్‌కు చెందిన ఎస్‌పి సింగ్ బీహార్‌కు చెందిన వారు. సీనియారిటీ ప్రకారం ఎస్‌పి సింగ్, ఎంజీ గోపాల్‌లలో ఒకరికి ప్రధాన కార్యదర్శి పదవి లభిస్తుందని భావించారు. ఎస్‌పి సింగ్ పట్ల ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎస్‌పి సింగ్ సచివాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. డిజిపి అనురాగ్ శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారుల సమక్షంలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం కావడంతో సచివాలయంలో అధికారుల సందడి లేదు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్‌పి సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ సిఎం కెసిఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సమన్వయంతో రాష్ట్భ్రావృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. ఉన్నతాధికారులు ఎస్‌పి సింగ్‌ను అభినందించారు.
ప్రదీప్ చంద్రకు ముందే తెలుసు
ప్రదీప్ చంద్ర కేవలం నెలరోజులు మాత్రమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రదీప్ చంద్రను ప్రధాన కార్యదర్శిగా నియమించే సమయంలోనే ప్రభుత్వం ఈ విషయం ఆయనకు చెప్పినట్టు తెలిసింది. ప్రత్యేక పరిస్థితిలో రాజీవ్ శర్మకు కేంద్రం రెండుసార్లు మూడేసి నెలల పాటు పదవీ కాలం పొడిగించారు, మీకు అలాంటి అవకాశం ఉండదు, నెల రోజులు మాత్రమే ప్రధాన కార్యదర్శిగా ఉండాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలిసింది. ప్రదీప్ చంద్ర కేవలం నెల రోజుల పాటు మాత్రమే చేశారు. ప్రధానకార్యదర్శిగా రిటైర్ కావాలని ఉందని, దీనికి ఒప్పుకోనే ప్రదీప్‌చంద్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారని అధికార వర్గాలు తెలిపాయి.
మైనారిటీ సలహాదారుగా ఎకె ఖాన్
రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఎకె ఖాన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఆరవింద్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.