రాష్ట్రీయం

కీలక స్థానంలోకి భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: భారతదేశం 2017 లో అంతర్జాతీయంగా కీలకస్థానంవైపు వెళుతుందని భగవాన్ విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రపంచంలో ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని అదుపు చేసేందుకు భారత్ చేసే కృషికి అంతర్జాతీయంగా మద్ధతు లభిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం సమసిపోయే అవకాశాలున్నాయని, శాంతి నెలకొంటుందన్నారు. అమెరికా, చైనా, బ్రిటన్ తదితర దేశాలన్నీ భారత్‌కు అన్ని రంగాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తాయన్నారు. ఆహారోత్పత్తిలో పూ ర్తిగా స్వయం సమృద్ధి సాధించిన భారత్, ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని, పారిశ్రామిక, వాణిజ్య, వర్తక రంగాల్లో మరింత ముందుకు వెళుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధివైపు వెళుతుందన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రస్తుతం ఏర్పడ్డ చిన్న చిన్న కష్టాలు తొలిగిపోతాయని, అవినీతి నిర్మూలనలాంటి మహాయజ్ఞాన్ని చేపట్టిన నరేందమోదీ ఉద్దేశం నెరవేరుతుందన్నారు. దేశంలోని యువత, మహిళలు, దేశప్రజలంతా కుల, మత, భాషా, ప్రాంతాలకు అతీతంగా మోదీ చేపట్టిన సంస్కరణలకు మద్ధతు ఇస్తున్నారన్నారు. గర్భిణీ మహిళ అనేక కష్టాలకు ఓర్చి పం డంటి బిడ్డను ప్రసవించినట్టే, దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇక్కట్లు తొలిగిపోయి, వేగంగా అభివృద్ధిదిశలో పయనిస్తుందన్నారు. మోదీ నేతృత్వంలో భారతదేశానికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇలా ఉండగా కె. చంద్రశేఖరరరావు నేతృత్వంలో తెలంగాణ ‘బం గారు తెలంగాణ’ వైపు, చంద్రబాబు నేతృత్వంలో ఎపి ‘స్వర్ణాంధ్ర’ వైపు పయనిస్తాయని విశ్వంజీ పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలను ఆర్థికంగా, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, విద్య, వైద్య పరంగా ముందుకు తీసుకుపోయేందుకు అమెరికా తదితర దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారంతా సహకరించాలని స్వామి సూచించారు. సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావలసిన అవసరం అందరిపై ఉంటుందని వివరించారు.

చిత్రం..విశ్వయోగి విశ్వంజీ మహరాజ్