రాష్ట్రీయం

భరోసా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 3: వచ్చే 48 గంటల్లో కిడ్నీ వ్యాధుల బారిన పడి తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథలైన పిల్లలను ఆదుకోకుంటే ఉద్యమానికి సిద్ధపడతానని రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అల్టిమేటం ఇచ్చారు. జిల్లాలో ఉద్దానంలో కిడ్నీ వ్యాధి సమస్యను ఘెర విపత్తుగా పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆరోగ్య భద్రత, ఆర్థిక భరోసా రెండురోజుల్లో ప్రకటించాలని, లేనిపక్షంలో ప్రజాఉద్యమం చేపడతానని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాధి సోకడానికి గల కారణాలు ఇంతవరకూ కనిపెట్టే ప్రయత్నం చేయలేకపోవడం దురదృష్టకరమన్నారు. మంగళవారం ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన పవన్‌కళ్యాణ్ - కిడ్నీ రోగులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. తాను రాజకీయ పార్టీ పెట్టింది, రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, సమాజాన్ని సరిదిద్దడానికేనంటూ తెలిపారు. ఇంతవరకూ ప్రభుత్వాలు కిడ్నీ సమస్యను గుర్తించలేకపోవడాన్ని విమర్శిస్తూ, ప్రస్తుతం టిడిపి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. రాబోయే కాలంలో చిన్నపిల్లలు దీని బారిన పడకుండా చూడాలన్నదే జనసేన ధ్యేయమన్నారు. ఈ సమస్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఇప్పటి వరకూ జరిగిన రీసెర్చ్‌లు ఎలా ఉన్నా, జనసేన రీసెర్చ్ బృందాన్ని 15 మంది వైద్యులతో నియమిస్తున్నట్టు ప్రకటించారు. వీరంతా రానున్న 15 రోజుల్లో నివేదికలు ఇస్తారని, ఆ నివేదికల నేరుగా సిఎంను కలసి ఉద్దానం కిడ్నీ రోగులను ఏ విధంగా ఆదుకుంటారో కచ్చితమైన ఉత్తర్వులు జారీ చేసే విధంగా పోరాటం చేస్తానంటూ ఉద్దానం కిడ్నీ రోగులకు భరోసా ఇచ్చారు. పుష్కరాల కోసం కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్న ప్రభుత్వం, క్యాపిటల్ అమరావతికి లెక్కలేనంత డబ్బు వెచ్చిస్తున్నప్పటికీ, శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్ని బాధితులవైపు కనె్నత్తి చూడకపోవడం విచారకరమన్నారు. వందకోట్ల రూపాయలు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి కేటాయించాలంటూ డిమాండ్ చేసారు. ఇప్పటికే రాష్ట్ర వైద్యశాఖ బడ్జెట్ 6000 కోట్లు ఉందని, అందులో ఉద్దానం కిడ్నీరోగుల కోసం కేటాయింపులు చేయడంలో ఎందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెనకడుగువేస్తున్నారో వివరణ ఇవ్వాలంటూ ప్రశ్నించారు. డయాలసిస్ సెంటర్లు అనే కుంటి సాకుతో కాలయాపన చేస్తే వందలు, వేలమంది ఈ రోగం బారిన పడి మరణిస్తున్నారన్నారు. అభివృద్ధి చెందని దేశంలో గల సమస్య ఇదని, ఇటువంటి సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి వున్నప్పటికీ, పట్టించుకోలేకపోవడం బాధాకరమన్నారు. ప్రజా ఓటుబ్యాంకు కోసం పనిచేసే పార్టీ జనసేన కాదని, ఆర్థికపరమైన సమస్యవల్లే కిడ్ని వ్యాధి విపత్తుగా మారిందన్నారు. కేవలం ఓట్లు వేయించుకునేటప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చినవారంతా సమస్యల పరిష్కారం దిశగా ఎందుకు ప్రజల వద్దకువచ్చి పనిచేయరంటూ ప్రశ్నించారు. రాష్ట్ర వీడిపోయినప్పుడు ఎపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పేరే తప్ప, ఉద్దానం కిడ్నీ జబ్బు సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళలేకపోయారని, దీనిని జనసేన ఖండిస్తుందని పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు.

చిత్రం..వేదికపై కిడ్నీ వ్యాధిగ్రస్తులతో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్