రాష్ట్రీయం

ఈ ఏడాది ఎమ్సెట్ యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లో 2017-18 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లకు యథాతథంగా ఎమ్సెట్ నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. 2018లో ఎమ్సెట్ నిర్వహణపై ఒక కమిటీ అధ్యయనం చేయాల్సి ఉందని వివరించారు. ఇంజనీరింగ్ స్ట్రీం, అగ్రికల్చర్ స్ట్రీం ఎమ్సెట్ వేర్వేరుగా జరుగుతుందని మెడికల్, డెంటల్ కాలేజీల అడ్మిషన్లు మాత్రం నీట్ ఆధారంగానే జరుగుతాయని వివరించారు. ఎఎఫ్‌ఆర్‌సి చైర్మన్ జస్టిస్ స్వరూపరెడ్డి, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకటాచలం, ప్రొఫెసర్ మల్లేశం, కార్యదర్శి శ్రీనివాసరావు సమక్షంలో ఉన్నత విద్యామండలి రూపొందించిన డైరీని పాపిరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే మూడు విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల నియామకం చేపడతామని అన్నారు. జెఎన్‌టియు ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీతో పాటు మూడింటికి సెర్చ్ కమిటీల సమావేశాలు కూడా పూర్తయ్యాయని, విసిల నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. అన్ని విశ్వవిద్యాలయాలకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను నియమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమైందని వివరించారు.
పదో షెడ్యూలులో ఉన్న సంస్థలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆయా భూభాగాలే ప్రాతిపదిక అవుతాయని, దాని ప్రకారం అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ, తెలుగు విశ్వవిద్యాలయాలకు విసిలను నియమించామని, ఆంధ్రాలో ద్రావిడ వర్శిటీ, పద్మావతి వర్శిటీలకు అక్కడి ప్రభుత్వం విసిలను నియమించిందని అన్నారు. కాని ఒకటి రెండు విషయాలలో అనవసరపు వివాదాలు చేస్తున్నారని పేర్కొన్నారు. స్టడీ సెంటర్ల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని, యుజిసికి ఇప్పటికే లేఖ రాశామని అన్నారు. ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును ఇప్పటికే అసెంబ్లీఆమోదించిందని, బిల్లు అమలుకు సంబంధించి డిప్యూటి సిఎం ఆధ్వర్యంలో ఒక కమిటీ పనిచేస్తోందని చెప్పారు. ఆ కమిటీ నిర్ణయం మేరకు కొత్త ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.