రాష్ట్రీయం

చట్టసవరణకైనా రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను మరింత మెరుగుపర్చేందుకు బడ్జెట్ సమావేశాల్లోనే చట్టంలో మార్పుచేర్పులు చేపట్టనున్నట్టు షెడ్యూల్ కులాల అభివృద్ధి మంత్రి జి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. శాసనసభలో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై జరిగిన లఘు చర్చలో విపక్ష సభ్యుల విమర్శలు, సూచనలు, సలహాలకు మంత్రి సమాధానమిచ్చారు. ఉప ప్రణాళిక అమలు సమీక్షకు ఇకనుంచి ప్రతి మూడు నెలలకోసారి ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. దీనిపై సలహా మండలి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఐటిడిఏల ఏర్పాటుపై అధ్యయనానికి ఉప సంఘం ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రంపై వొత్తిడి తెచ్చేందుకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి గత ప్రభుత్వాలు చేసిన దానికంటే తాము ఎక్కువే చేసి చూపించామన్నారు. కాంగ్రెస్ హయాంలో 7 వేల ఎకరాలు పంపిణీ చేస్తే, తెరాస ప్రభుత్వం రెండున్నరేళ్లలో 9 వేల ఎకరాలు పంపిణీ చేసిందని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు దళితులను చైర్మన్లుగా నియమించింది తామేనన్నారు. కొత్తగా ఎస్సీలకు 103, ఎస్టీలకు 51 గురుకుల పాఠశాలలు, 30 మహిళా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల విదేశీ చదువుకు కాంగ్రెస్ హయాంలో కేవలం నాలుగు కోట్లు వెచ్చిస్తే, తాము రూ.46 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. స్వయం ఉపాధి పథకం కింద 3200 మంది ఎస్సీలు, 1400 మంది ఎస్టీ నిరుద్యోగులకు 50 శాతం సబ్సిడీతో రుణాలు అందించామన్నారు. రుణ పరిమితిని లక్ష నుంచి పది లక్షలకు పెంచామన్నారు. ఎన్నికల ప్రణాళికలో హమీ ఇవ్వకున్నా కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 51 వేల ఎస్సీ, 28 వేల ఎస్టీ యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించామన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులకూ మెస్ చార్జీలు పెంచే యోచన ఉందన్నారు. ఉప ప్రణాళికలో కేటాయించిన దానికంటే ఎక్కువ నిధులు ఖర్చు చేయడంతోపాటు గత ప్రభుత్వాలు చేసిన దానికంటే ఎక్కువే చేసి చూపిస్తామని మంత్రి జగదీశ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్, తెదేపా, సిపిఎం వాకౌట్
ఇదిలావుంటే, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందంటూ కాంగ్రెస్, తెదేపా, సిపిఎం ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానంపై నిరసన వ్యక్తం చేస్తూ సభనుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ సబ్ ప్లాన్‌లో ఖర్చు చేయకుండా మిగిలిపోతున్న నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరం నిధుల్లో కలపకపోవడంతో మురిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉప ప్రణాళిక పట్ల ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శిస్తూ, ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. టిడిపి శాసనసభాపక్షం నాయకుడు ఎ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడం, ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తికి శాఖను అప్పగించడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు. సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ ప్రభుత్వ అసమగ్ర సమాధానాలకు నిరసనగా వాకౌట్ చేశారు. స్పీకర్ మధుసూదనాచారి సభను 17కి వాయిదా వేశారు.