తెలంగాణ

యాదాద్రికి రేపు సిఎం కెసిఆర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 4: సిఎం కెసిఆర్ మరోసారి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి రానున్నారు. కెసిఆర్ రాక..అభివృద్ధి పనుల సమీక్షతోనైనా ఏడాదిగా నామమాత్రంగా సాగుతున్న యాదాద్రి అభివృద్ధి పనులు పరుగులు పెట్టవచ్చన్న ఆశలు రేపాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాలో పర్యటనలో భాగంగా ఈ నెల 5న వరంగల్ పర్యటనకు వెళ్లి తిరుగు ప్రయాణంలో 6వ తేది రాత్రి గుట్టకు చేరుకుంటారు. చండీయాగం పిదప కుటుంబ సభ్యులతో యాదాద్రిలో స్వామి వారి సన్నిధిలో బస చేసే నిమిత్తం సిఎం కెసిఆర్ ఇక్కడికి రానున్నారు. మరుసటి రోజు 7వ తేదిన యాదాద్రి అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహిస్తారని అధికార వర్గాల సమాచారం. సిఎం కెసిఆర్ యాదాద్రి పర్యటన అధికారికంగా ప్రకటించకపోయినా ఆయన రాక కోసం గుట్టపై తగిన ఏర్పాట్లు సాగుతున్నాయి. సిఎం రాక నేపధ్యంలో వైటిడిఏ అధికారుల బృందం నేడు యాదగిరిగుట్టను సందర్శించనుంది.
ఆగిసాగుతున్న అభివృద్ధి..
యాదాద్రిని దేశంలోనే దివ్వక్షేత్రంగా టెంపుల్ సిటీగా తీర్చుదిద్దుతామన్న సిఎం కెసిఆర్ ప్రకటన మేరకు ఏటా బడ్జెట్‌లో 100కోట్ల మేరకు నిధుల కేటాయింపు జరిగిన ఏడాది కాలంగా అభివృద్ధి పనుల్లో మాత్రం ఆశించిన పురోగతి లేకపోవడం కొంత నిరాశ పరుస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో 2014 ఆక్టోబర్ 17న తొలిసారి యాదగిరిగుట్టను సందర్శించి యాదాద్రి అభివృద్ధి కార్యాచరణను ప్రకటించారు. ఆ వెంటనే తాను చైర్మన్‌గా వైటిడిఏను సైతం ఏర్పాటు చేసి అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన చేశారు. పలుమార్లు యాదాద్రి విస్తరణ డిజైన్లు మారడం, టెక్నికల్ కమిటీ ఏర్పాటు ఆలస్యంగా వేయడం కొంత పనుల వేగానికి బ్రేక్‌లు వేసింది. ఇప్పటిదాకా సిఎం కెసిఆర్ ఏడు పర్యాయాలు యాదాద్రిని సందర్శించారు. యాదాద్రి దేవాలయ విస్తరణ, టెంపుల్ సిటీ, గోపురం ఎత్తు పెంపు, అంజనేయస్వామి భారీ విగ్రహం, మహామండప నిర్మాణం, ప్రాకారాలు, యాదాద్రికి వచ్చే నలువైపులా రోడ్లను నాలుగు లైన్లుగా విస్తరణ, నృసింహ అభయారణ్యం పనులు చేపట్టాలని కార్యాచరణ ప్రకటించారు. ఇందులో కేవలం ఆర్‌అండ్‌బి పరిధిలోని రాయగిరి-యాదాద్రి రోడ్డు విస్తరణ పనుల ప్రారంభం మినహా మిగతా వాటికి సంబంధించి గడిచిన 14నెలల నుండి ఎలాంటి పురోగతి లేదు. గత ఏడాది మే నెల 30వ తేది చినజీయర్ స్వామి, గవర్నర్‌లతో కలిసి సీఎం కెసిఆర్ యాదాద్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తదుపరి గత దసరా రోజున యాదాద్రి దేవాలయ విస్తరణ పనులకు వైటిడిఏ బృందం భూమి పూజ చేసింది. అయతే నేటికీ యాదాద్రి అభివృద్ధి పనుల్లో మాత్రం పురోగతి కొరవడటం నిష్ఠూర సత్యం. పలు పర్యాయాలు సిఎం కెసిఆర్ యాదాద్రి విస్తరణ పనులపై రాజధానిలోను వైటిడిఏ, ఎండోమెంట్, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో సమీక్షలు చేసినా పనుల్లో ఆశించిన వేగం లేకపోయింది. ఇప్పటిదాకా నిర్ధేశిత 2వేల ఎకరాల భూసేకరణకు సంబంధించి 1850ఎకరాల భూసేకరణ ప్రక్రియ సాగింది. సేకరించిన భూమిలో వైటిడిఏ కార్యాచరణ మేరకు టెంపుల్ సిటీ నిర్మాణంలో భాగంగా 250ఎకరాల్లో గుట్ట దిగువన 200కోట్లతో నిర్మించే టౌన్‌షిప్‌కు నూతన సంవత్సరం రోజున టెండర్లు పిలిచారు.
రెండెకరాల్లో నిర్మించే ప్రధాన ఆలయ విస్తరణ పనులకు సంబంధించి రోడ్లు భవనాల శాఖ బృందం మట్టి, రాయి పరీక్షలకు నేడోరేపో గుట్టను సందర్శించనుంది. ఇవి మినహా యాదాద్రి అభివృద్ధి పనుల్లో పరుగులు లేని నేపధ్యంలో ఈ దఫా సీఎం కెసిఆర్ రాక సందర్భంగా జరిగే సమీక్షతోనైనా యాదాద్రి అభివృద్ధి ముందడుగు పడవచ్చని అంతా ఆశలు పెట్టుకున్నారు.