రాష్ట్రీయం

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఐఎన్‌టియుసి ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. స్థానిక ఉర్దుఘర్‌లో శుక్రవారం జరిగిన ఐఎన్‌టియుసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల సాధనే ఐఎన్‌టియుసి లక్ష్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమాన్ని మరచి పెట్టుబడుదారుల మెప్పు పొందేందుకు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పును అమలుచేసి కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మిక సంఘాలు పోరాటాలు నిర్వహిస్తున్నా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అనాలోచితంగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో సామాన్య ప్రజలు, కార్మికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించి బాధల తెలంగాణగా మార్చారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థను రూపుమాపుతామన్న ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోడంలో విఫలమయ్యారని విమర్శించారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఐఎన్‌టియుసి అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ రంగాల కార్మిక సంఘాల ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. తొలుత రైల్వే స్టేషన్ నుండి ఉర్దుఘర్ వరకు ఐఎన్‌టియుసి ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎ జలీల్, నాయకులు శ్రీ్ధర్, ఎం శ్రీనివాస్, జేమ్స్‌పాల్, రామకృష్ణ, త్యాగరాజన్, గడ్డం రమేష్, వెంకటేశ్వరరెడ్డి, సారయ్య, సాంబయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఎ రజాక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో ప్రసంగిస్తున్న ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి