రాష్ట్రీయం

గౌతమీపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ లాబీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. అనంతరం ఇద్దరూ ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. చారిత్రక నేపథ్యంతో నిర్మించిన గౌతమీపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వాలని బాలకృష్ణ ముఖ్యమంత్రిని కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే పన్ను మినహాయింపు ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక వ్యక్తుల మీద తీసిన సినిమాలకు తగిన సహకారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం విధానంగా పెట్టుకున్నదని కెసిఆర్ చెప్పారు. గతంలో రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చామని, ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇస్తామని చెప్పారు.
భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగుతుందని కెసిఆర్ తెలిపారు. పన్ను మినహాయింపుపై నిర్ణయం తీసుకున్న కెసిఆర్‌కు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభమయి, కేవలం 79 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుందని బాలకృష్ణ తెలిపారు. జనవరి 12న సినిమా విడుదల అవుతుందని, మొదటి ప్రదర్శన చూడాలని బాలకృష్ణ కెసిఆర్‌ను ఆహ్వానించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నిర్మాత రాజీవ్‌రెడ్డి, చిత్ర సమర్పకుడు బిబో శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం..సిఎం కెసిఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ