తెలంగాణ

ప్రయాణాల గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: సంక్రాంతి సంబరాలకు కౌంట్ డౌన్ మొదలవ్వడంతో, జనం నిలువు దోపిడీకి ‘ప్రైవేట్’ సైతం సమాయత్తమైంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే జనాన్ని ప్రైవేట్ బస్సులు దోపిడీ చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ఆర్టీసీ సంస్థలు పెద్దఎత్తున ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూనే, ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు తప్పదని ప్రకటించాయి. ఆంధ్రకు వెళ్లే రైళ్లలో బెర్తుల రిజర్వేషన్ నాలుగు నెలల క్రితమే ముగిసింది. రిజర్వేషన్ కోచ్‌ల్లో టిక్కెట్లిచ్చే పరిస్ధితి లేదు. రిగ్రేట్ అని చెబుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పెద్దఎత్తున ప్రత్యేక రైళ్లు నడుపుతామని ప్రకటించినా ఫలితం కనిపించటం లేదు. ఎప్పటిలాగే అష్టకష్టాలు, ఆపసోపాలు పడి గమ్యానికి చేరుకోవాల్సిన కష్టకాలమే కనిపిస్తోంది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్ధ (టిఎస్‌ఆర్టీసి) సంక్రాంతి సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పెద్దఎత్తున బస్సులు తిప్పనున్నట్టు ప్రకటించింది. దాదాపు 2450 బస్సులు నడుపుతున్నారు. ఈనెల 8 నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నానికి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఈ బస్సులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తాయి. అందుకే అదనపు చార్జీలు వసూలు చేయకతప్పదని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి సూపర్ లగ్జరీ బస్సు చార్జీ రూ. 746 అయితే, ఇప్పుడు స్పెషల్ బస్సులో రూ.1119 వసూలు చేస్తున్నారు. గరుడ బస్సు చార్జీ రూ.181, డీలెక్స్ బస్సులో రూ. 946, ఎక్స్‌ప్రెస్ బస్సులో రూ.840 వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సూపర్ లగ్జరీ బస్సు చార్జీ రూ.497 అయితే రూ. 792 వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ -గుంటూరు డీలెక్స్ బస్సు చార్జీ రూ.329 ఉంటే, రూ.439ను వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రత్యేక సర్వీసుల్లో సీట్లు దొరికే అవకాశం ఉన్నా, అదనపు చార్జీలు చెల్లించాల్సిన వైనంపై ప్రయాణికులు ఊగిసలాటలోనే ఉన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, భీమవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు తదితర నగరాలకు ప్రైవేట్ టూరిస్టు బస్సులకు అనుమతి లేకున్నా సర్వీసులను తిప్పుతున్నారు. ప్రయాణికులను ఎక్కించుకుని టిక్కెట్ ఇచ్చే బస్సులకు స్టేజి క్యారియర్ సర్వీసులంటారు. ఒక ఆర్టీసీ బస్సులకే స్టేజి క్యారియర్ అనుమతి ఉంటుంది. ప్రైవేట్ బస్సులకు కాంట్రాక్టు క్యారియర్ అనుమతి ఉంటుంది. టిక్కెట్లు ఇవ్వకుండా సామూహికంగా బస్సును బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రవాణా శాఖ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ప్రైవేట్ ఆపరేటర్లు పెద్దఎత్తున స్టేజి క్యారియర్లను తిప్పుతున్నారు. ప్రైవేట్ ఆపరేటర్లు విశాఖపట్నానికి రూ.1800 నుంచి రూ.2000, రాజమండ్రికి రూ.1500 నుంచి రూ.1800, విజయవాడకు వెయ్యి చొప్పున ఏసి బస్సుల్లో చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇదిలావుంటే, దక్షిణ మధ్య రైల్వే ఈనెల 20 వరకు 136 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు ఈనెల 10 నుంచి 16 వరకు సికింద్రాబాద్ ఫ్లాట్‌ఫారమ్ టికెట్ ధర రూ. 20లుగా ప్రకటించింది.