తెలంగాణ

దద్దరిల్లిన జడ్పీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 4: ప్రజాసమస్యలను గాలికి వదిలి సొంత ఎజెండాలు, రాజకీయ అంశాలు తెరపైకి రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సభ్యుల వాగ్వాదాలు, ఆందోళనలతో దద్దరిల్లింది. సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన జడ్పీ సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, జిల్లాకు సంబంధించిన జడ్పీటిలు, ఎంపిపిలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే జడ్పీటిసిలు, ఎంపిపి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జడ్పీటిసిల నిధుల వినియోగంపై పలువురు జడ్పీటిసిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు రావాల్సి నిధులను ఎమ్మెల్యేలకు ఎలా ఇస్తారని తెరాస, కాంగ్రెస్, టిడిపి, బిజెపి జడ్పీటిసిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలోపే ఎంపిపి కల్పించుకుని తమకు రావాల్సి నిధుల్లో కూడా జడ్పీటిసిల భాగస్వామ్యం ఏమిటని ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా జడ్పీ సమావేశ మందిరం నినాదాలతో దద్దరిల్లిపోయింది. అదేవిధంగా మరోసారి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, వనపర్తి జడ్పీటిసి శంకర్‌నాయక్ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర దుమారం రేపింది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ జడ్పీటిసి శంకర్‌నాయక్ కల్పించుకుని అసెంబ్లీలో మాట్లాడాలని ఇక్కడ తాము మాట్లాడుతామని ఎమ్మెల్యే వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. దీంతో మరోసారి సభా ప్రాంగణం తెరాస, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాటకు దారితీసింది. పరిస్థితి చేజారిపోతుందని గమనించిన మంత్రి జూపల్లి కృష్ణారావు వేదికపై నుండి కిందికి వచ్చి ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు జడ్పీటిసి, ఎంపిపిలను సముదాయించారు. సమావేశం తిరిగి ప్రారంభమైంది. ఈ తరుణంలో ఎంపిడిఓలు తమ మాట వినడం లేదని, నిధుల విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని పలువురు ఎంపిపి, జడ్పీటిసిలు మూకుమ్మడిగా సభా వేదిక వద్దకు దూసుకువచ్చారు. ఇంతలోనే కాంగ్రెస్ జడ్పీటిసిలు, ఎంపిపిలపై జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని సూచించినప్పటికీ ససేమిరా అన్నారు. దీంతో జడ్పీ చైర్మన్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ ఎంపిపిలు, జడ్పీ చైర్మన్ తీరుపట్ల నిరసన వ్యక్తం చేశారు. పలుమార్లు జడ్పీ చైర్మన్‌ను మంత్రి జూపల్లికృష్ణారావు వారించారు. చివరకు చేయిపట్టుకుని సైతం వారించి కాంగ్రెస్ జడ్పీటిసిలను సైతం సముదాయించారు. ఏదేమైనప్పటికీ సమావేశంలో మాత్రం టిఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య పలుమార్లు వాగ్వాదం, తోపులాట సంఘటనలు చోటుచేసుకున్నాయి. మంత్రి జూపల్లికృష్ణారావు సముదాయించడంతో చివరకు ఉపాధిహామీ పథకం, తాగునీటి సమస్యపై సమావేశంలో చర్చించారు.