రాష్ట్రీయం

బస్సుల్లో స్వైప్‌మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 8 : ఆర్టీసి బస్సుల్లో చిల్లర కష్టాలను దూరం చేసేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట ఆర్టీసి బస్సుల్లో స్వైప్ మిషన్లను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆర్టీసి నష్టాలబాటలో ప్రయాణిస్తుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా పెద్దనోట్లు రద్దు సంస్థపై పిడుగుపాటుగా మారిందని ఆయన అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసికి రోజుకు 80 లక్షల రూపాయల నష్టం వస్తోందని అన్నారు. ఆర్టీసి సంస్థను అంతా కలసి రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని ఆర్టీసి బస్టాండ్‌లో కండక్టర్లకు స్వైప్ మిషన్లను, ఆర్టీసీ సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో కలసి హరీష్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. పెద్దనోట్లు రద్దు తర్వాత సామాన్య ప్రజలకు చిల్లర కష్టాలు అధికమైనాయని, ఆర్టీసి బస్సుల్లో ప్రయాణీకులు 2వేల రూపాయలు ఇస్తే చిల్లర లేక దింపివేసిన ఘటనలున్నాయన్నారు. సిద్దిపేట నియోజక వర్గాన్ని నగదు రహిత లావాదేవీల్లో నెంబర్‌వన్‌గా చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నామని, ఆర్టీసి బస్సుల్లో సైతం క్యాష్‌లెస్ విధానం అమలు చేసేందుకే స్వైప్ మిషన్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. సిద్దిపేట డిపోలో బస్సుల్లో 139 స్వైప్ మిషన్లు అందచేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు కార్డు లేదా నగదు సైతం చెల్లించి టికెట్ తీసుకోవచ్చని, ప్రజల సౌలభ్యం కోసం క్యాష్‌లెస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బస్సులో స్వైప్ మిషన్లతో పాటు, మోబైల్ యాప్, క్యూఆర్ పద్ధతిలో శిక్షణ ఇస్తే ఏ పద్ధతిలోనైనా డబ్బులు చెల్లించే అవకాశం ఉందన్నారు. నియోజక వర్గంలో ఇబ్రహీంపూర్, ఇర్కోడ్, తోర్నాల, కోదండరావుపల్లి, లక్ష్మిదేవిపల్లి, బుస్సాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో క్యాష్‌లెస్‌గా మారాయని, చదువురాని మహిళలు సైతం నగదు రహిత లావాదేవీలను చక్కగా నిర్వహిస్తున్నారని అన్నారు. కాగా సిద్దిపేట నుంచి లాంగ్‌రూట్ బస్సులు వేస్తే లాభాలు వస్తాయని, షిరిడి, తిరుపతికి బస్సులు నడపాలని ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణను ఈ సందర్భంగా మంత్రి కోరారు. కాగా 55 లక్షల వ్యయంతో కాష్‌లెస్ విధానం కోసం ఆర్టీసిలో సాఫ్ట్‌వేర్ మార్చామని, సిబ్బంది ఈ విధానాలను సక్రమంగా అమలు చేస్తే లాభాలు వస్తాయని సత్యనారాయణ అన్నారు. ఈకార్యక్రమంలో ఆర్టీసి సంస్థ ఈడి నాగరాజు, జెడి వెంకట్‌రావు, జెసి హన్మంత్‌రావు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, డివిఎం సంజీవరెడ్డి, డిఎం సురేష్‌బాబు, కౌన్సిలర్లు వెంకట్‌గౌడ్, బర్లమల్లికార్జున్ పాల్గొన్నారు.

చిత్రం..కండక్టర్లకు స్వైప్ మిషన్లు అందచేస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ