రాష్ట్రీయం

ఎనిమిదో శతాబ్దిలోనే ఇక్కడికి వచ్చా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 9: తన మనవడికి పూర్వజన్మ స్మృతులున్నాయని భూటాన్ రాణి ఆసాదోచి వాన్గ్మో హాంగ్‌హుక్ తెలిపారు. 8వ శతాబ్దంలో అతను భారతదేశంలో పర్యటించినట్లు, పలు రకాల ప్రాంతాల గురించి చెప్పడంతో తాము భారతదేశ పర్యటనకు వచ్చినట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆమె తన కోడలు, ఇద్దరు మనుమళ్లతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన చిన్న మనవడికి పూర్వజన్మ స్మృతులు కలిగాయన్నారు. ఈ క్రమంలో తాము భారతదేశానికి వచ్చి నలంద, నాగార్జునకొండ వంటి ప్రాంతాలను సందర్శించామన్నారు. 8వ శతాబ్దంలో తన 15వ యేట భారతదేశానికి వచ్చినట్లు తన మనవడు చెప్పాడన్నారు. 40 సంవత్సరాల పాటు భారతదేశంలో బౌద్ధగురువుగా కూడా పర్యటించాడన్నారు. అతను చెప్పిన ప్రాంతాలు, తిరిగిన ప్రదేశాలు ఇప్పటికీ యథాతథంగా ఉండటం తమకు అద్భుతమనిపించిందన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రాశస్త్యాన్ని తెలుసుకుని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడానికి వచ్చామన్నారు.
ఈ నేపధ్యంలో ఆమె సామాన్య భక్తులతో కలసి ఎంతో భక్తిప్రపత్తులు, వినయ విధేయలతో స్వామివారిని దర్శించుకోవడం కనిపించింది. ఆమెవెంట వచ్చిన మూడేళ్ళ చిన్న మనవడు స్వామివారిని మహాలఘు దర్శనంద్వారా దర్శించుకున్నప్పుడు భూటాన్ రాజుల తరహాలో కాకుండా భూటాన్ సంప్రదాయ పద్ధతిలో నమస్కరించి, ప్రార్థించడం టిటిడి ఉద్యోగులను, భక్తులను ఆశ్చర్యపరిచింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి తిరిగి వెళ్ళేవరకు ఆ మూడేళ్ళ చిన్నారి ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. ఇదిలావుండగా సోమవారం వైకుంఠ ద్వాదశి కావడంతో వారు వైకుంఠ ద్వారంలో కూడా ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకరణలను చూసి పులకించారు. దర్శనానంతరం అద్దాలమేడ మండపం చేరుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా గత రెండు రోజులుగా కుటుంబ సభ్యులతో కలసి భారతదేశంలోని పలు ప్రాంతాలను సందర్శించి తిరుమలకు చేరుకున్న భూటాన్ రాణి పద్మావతి అతిధిగృహాల వద్ద ఉన్న ఆతిధ్య బిర్లా అతిధిభవనం వద్దకు చేరుకోగానే డిప్యూటీ ఇఓ హరీంధ్రనాథ్, ఓఎస్‌డి లక్ష్మీనారాయణ యాదవ్ వారికి సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

చిత్రం.. తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి క్యూలైన్‌లో వెళ్తున్న భూటాన్ రాణి దంపతులు