తెలంగాణ

క్యాట్‌లోనూ మనవారే భేష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: దేశవ్యాప్తంగా ఉన్న 20 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష ‘కామన్ అడ్మిషన్ టెస్టు’ (క్యాట్) ఫలితాలను నిర్వాహక సంస్థ బెంగళూరు ఐఐఎం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 138 నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 2,32,434 మంది రిజిస్టర్ చేసుకోగా, అందులో 1.95 లక్షలు అర్హత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుండి సీటు పొందేందుకు వీలున్న పర్సంటైల్‌ను 15వేల మంది సాధించారు. సీట్లు పొందిన వారి తొలి జాబితాను జనవరి 3వ వారంలో ప్రకటించే వీలుంది. దేశవ్యాప్తంగా 20 మంది అభ్యర్థులు నూటికి నూరు శాతం పర్సంటైల్ సాధించారు. అందరూ అబ్బాయిలు కావడం, అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులే కావడం ఈసారి గమనార్హం. తొలి 20 మందిలో కొల్‌కటాకు చెందిన అవిదిప్తో చక్రవర్తి, పూనేకు చెందిన యాష్ చౌదరి అగ్రస్థానంలో ఉన్నారు.
అవిదిప్తోకు వెర్బల్ అబిలిటీలో 96.27, డాటా ఇంటర్‌ప్రిటేషన్‌లో 68.16, క్వాంటిటేటివ్ అబిలిటీలో 77.25 శాతం స్కోర్ సాధించి వంద శాతం పర్సంటైల్ పొందారు. యాష్ చౌదరి ప్రస్తుతం పూనే కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. వెర్బల్‌లో 86.15, డాటాలో 60.44, క్వాంటిటేటివ్‌లో 73.50 స్కోర్ సాధించాడు. సున్నా కంటే తక్కువ పర్సంటైల్ సాధించిన వారు 14వేల మంది కాగా, క్వాంటిటేటివ్‌లో సున్నా కంటే తక్కువ సాధించిన వారు 37వేల మంది ఉన్నారు. డాటా ఇంటర్‌ప్రిటేషన్‌లో సున్నా కంటే తక్కువ సాధించిన వారి సంఖ్య 56వేలు ఉంది. పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ మేనేజిమెంట్, పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజిమెంట్, పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ ఫుడ్ అండ్ అగ్రిబిజినెస్ మేనేజిమెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజిమెంట్, పోస్టుగ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఇన్ సెక్యూరిటీస్ మార్కెట్‌లలో ఐఐఎంలు పిజి కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.