రాష్ట్రీయం

వైకుంఠ రామయ్య ఉత్తర ద్వార దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 9: ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఉత్తరద్వార దర్శనం సోమవారం తెల్లవారుఝామున వైభవంగా జరిగింది. సరిగ్గా ఉదయం 5గంటల సమయంలో వేద పండితులు, అర్చకులు, ఆస్థాన విద్వాంసులు ‘అడుగో కోదండపాణి..’ అనే కీర్తనలు ఆలపిస్తుండగా, జేగంటలు మోగుతుండగా గుగ్గిలం పొగలు, భక్తుల రామ నామస్మరణల మధ్య వైకుంఠ రామయ్య ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు అర్ధరాత్రి స్థానిక తహశీల్దారు రామకృష్ణ రామదాసు పేరిట శ్రీ సీతామచంద్రస్వామి మూలవరులకు రెవెన్యూ శాఖ తరపున గర్భగుడిలో అభిషేకం చేశారు. అనంతరం స్వామిని ఊరేగింపుగా ఉత్తరద్వారం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ భజగోవిందం, తిరునామ సంకీర్తన, వైకుంఠ ఏకాదశి వైభవం, ప్రవచనం, వివిధ మంగళవాద్య-ఘంటా-వేదఘోషల మధ్య ఉత్తరద్వారం తలుపులు తెరుచుకున్నాయి. గుగ్గిలం పొగలతో స్వామివారి సన్నిధి వైకంఠాన్ని తలపించింది. గరుడ వాహనంపై రామయ్య, గజ వాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి భక్తులకు కనులవిందుగా దర్శనమిచ్చారు. ఆస్థాన విద్వాంసులు వినతాసుతవాహన అనే కీర్తనతో వైకుంఠ రాముడికి సంగీతాభిషేకం చేశారు. ఆరాధన, శ్రీరామ షడక్షరీర మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన, చతుర్వేద విన్నపాలు, గద్యత్రయము విన్నపం, తిరుప్పల్లాండు మంగళాశాసనం, 108 వత్తులతో హారతి వరుస క్రమంలో నిర్వహించారు. అనంతరం స్వామి తిరువీధి సేవగా రాజవీధిలో భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి వేళ స్వామి మంగళరూపాన్ని వీక్షించేందుకు భక్తులు బారులుతీరారు.
స్వామికి స్వాగతం పలుకుతూ గోవిందరాజస్వామి ఆలయం వరకు వెళ్లారు. తిరిగి స్వామి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి స్థానిక డిఎస్పీ కార్యాలయంలో రాపత్ ఉత్సవం జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సతీమణి శోభ, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముక్కోటి ఉత్తరద్వార దర్శనం వీక్షించారు.