రాష్ట్రీయం

శాస్త్రోక్తంగా చక్రస్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 9: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలోని వరాహస్వామి ఆలయం వద్ద ఉన్న శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని సోమవారం ఉదయం అర్చక స్వాములు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి అనంతరం ద్వాదశి రోజున తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానాన్ని టిటిడి ఆనవాయితీగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4.30 నుంచి 5.30 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీస్వామి పుష్కరిణితీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన ఎవరైతే స్నానమాచరిస్తారో అటువంటి వారికి తిరుమల శేషగిరులలో వెలిసి ఉన్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రసక్తి. కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దుచేసింది. టిటిడి ఇఓ డాక్టర్ డి సాంబశివరావు, జెఇఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

చిత్రం..తిరుమల వరాహ పుష్కరిణిలో సోమవారం వేకువజామున చక్రస్నానం నిర్వహిస్తున్న అర్చకులు