రాష్ట్రీయం

కొత్త పారిశ్రామిక విధానం కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యానాం, జనవరి 9: పుదుచ్ఛేరిలో నూతన పారిశ్రామిక విధానం అమలు ఇప్పట్లో సాధ్యం కాదని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ అన్నారు. యానాం ప్రజాఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆమె సోమవారం ఉదయం స్థానిక పరిపాలనాధికారి కార్యాలయంలో ప్రజల వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. యానాంలో పరిశ్రమలు తరలిపోతున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకురాగా గత పదేళ్లుగా ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పొందుతూ కూడా పారిశ్రామికవేత్తలు పన్నులు, కరెంటు బిల్లులు ఎగవేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఆనలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో ప్రస్తుతం పుదుచ్ఛేరి ప్రభుత్వం గతంలో చేసిన అప్పులకు వడ్డీ చెల్లించే స్థితిలో కూడా లేదన్నారు. వడ్డీలు చెల్లించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ఎక్కడ ఎంతవరకూ నిధులు అవసరమో అంతవరకే ఖర్చు చేస్తూ పొదుపుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ స్థితిలో నూతన పారిశ్రామిక విధానం అమలుచేయడం సాధ్యం కాదన్నారు. యానాం చాలా పరిశుభ్రంగా ఉందని బొటానికల్ గార్డెన్‌లో ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. అంతకుముందు ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు.
జ్ఞాపిక తీసుకెళ్లడానికి నిరాకరణ
ప్రజా ఉత్సవాల వేదికపై మంత్రి మల్లాడి బహూకరించిన జ్ఞాపికను తీసుకువెళ్లేందుకు కిరణ్‌బేడీ సున్నితంగా తిరస్కరించారు. దానిని పరిపాలనాధికారి కార్యాలయంలో ఉంచాలని పరిపాలనాధికారి సుబ్రహ్మణ్యంను కోరారు. తిరస్కరిస్తే తన మనస్సు బాధపడుతుందని మంత్రి మల్లాడి పేర్కొన్నప్పటికీ ఆమె తనతో తీసుకువెళ్లేందుకు నిరాకరించారు. అనంతరం పోలీసులు ఇచ్చిన గౌవర వందనాన్ని స్వీకరించి, ఆమె పుదుచ్ఛేరి వెళ్లిపోయారు.

చిత్రం..ప్రజల వినతులు స్వీకరిస్తున్న పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి