రాష్ట్రీయం

ఇంగ్లీషు మోజులో తెలుగు రాష్ట్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: రెండు తెలుగు రాష్ట్రాలూ ఆంగ్లభాష మోజులో పడ్డాయి. 2010 నుండి ఇందుకు సంబంధించిన ప్రణాళికలు వేస్తున్నా, సరైన వౌలిక సదుపాయాలు, నిపుణులను సిద్ధం చేసుకోకుండానే పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం క్లాసులు నిర్వహించేందుకు సన్నద్ధం కావడం వివాదాస్పదం అవుతోంది. ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రాలోనూ భాషాభిమానులు ప్రభుత్వ చర్యలను తూర్పారపడుతున్నారు. తల్లిదండ్రులు కోరుతున్నారు కనుక ఇంగ్లీషు మీడియం అమలు చేయక తప్పడం లేదని తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, ఆంధ్రా మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు చెబుతున్నారు. వాస్తవానికి ఏదో రకంగా ఇంగ్లీషు మీడియం ప్రారంభించేందుకు 2004లోనే ప్రయత్నాలు ప్రారంభమైనా, సీరియస్‌గా 2008 నుండి ప్రారంభమయ్యాయి.
2008 జూన్ 10వ తేదీన ప్రభుత్వం జీవో 76ను జారీ చేసింది. దానిని సమర్ధిస్తూ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రారంభించాలని 2010 జనవరి 20న జీవో 30 జారీ చేసింది. దీని ప్రకారం 2010-11 విద్యాసంవత్సరంలో సక్సెస్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రారంభించాలన్నది ఆ జీవో సారాంశం. అప్పటికి అందుబాటులో ఉన్న 6500 పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్ అమలుచేస్తూ ఆంగ్లమాద్యమం ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ అంశంపై అధ్యయనం కూడా నిర్వహించారు. ఎమ్మెల్సీలు, టీచర్ల సంఘాల నాయకులతో కూడా మాట్లాడినపుడు వారంతా ఇంగ్లీషు మీడియం అమలుకు సానుకూలత వ్యక్తం చేసినా, సిబిఎస్‌ఇ స్థానే స్టేట్ సిలబస్‌నే అమలుచేయాలని కోరారు. తర్వాత రాష్ట్ర విభజన ఉద్యమాలు ఊపందుకోవడం, రాష్ట్ర విభజన జరిగిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత కాలం ఇంగ్లీషు మీడియం ఆలోచన పక్కన పెట్టి తర్వాత 2015 ఆగస్టు 14న జీవో 53 జారీ చేసింది. 2016 జూన్ 4న జీవో 332 జారీ చేస్తూ కనీసం ప్రయోగాత్మకంగా మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం అమలుకు జీవో ఇచ్చింది. పరిస్థితులను, పర్యావసానాలను పరిశీలించేందుకు మున్సిపల్ శాఖ డైరెక్టర్, కార్పొరేషన్ల కమిషనర్లు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎపి ప్రభుత్వం 2016 అక్టోబర్ 10న జీవో 262 ఇచ్చింది, అనంతరం అదే సంవత్సరం నవంబర్ 3న జీవో 280ని జారీ చేసింది. దానిపై పెద్దగా వ్యతిరేకత రాకపోవడంతో 2017 జనవరి 2వ తేదీన జీవో 14ను జారీ చేసింది. దాని ప్రకారం 1వ తరగతి నుండి 9వ తరగతి వరకూ అన్ని మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం తరగతులు ప్రారంభించడమేగాక, తెలుగు మీడియం తరగతులను మూసివేయాలని కూడా పేర్కొంది. ఉత్తర్వుల వ్యవహారం తెలుసుకున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎపి ప్రభుత్వం సర్క్యులర్ 7175 జారీ చేస్తూ తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు ప్రకటించింది.
తెలంగాణలోనూ సక్సెస్ స్కూళ్లతో పాటు మిగిలిన పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియం క్లాసులు మొదలయ్యాయి. దీనిపై విద్యార్ధి సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో తల్లిదండ్రులే కోరుతున్నారు కనుక ఇంగ్లీషు మీడియం ప్రారంభిస్తున్నట్టు మంత్రులు స్వయంగా చెప్పారు.
గతంలో తెలంగాణలో 3072 , ఆంధ్రాలో 3428 సక్సెస్ స్కూళ్లకు అప్పటి కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిని అతి పెద్ద హైస్కూళ్లలోనే సమాంతర తరగతులతో ప్రారంభించారు. ఆంధ్రాలో మొత్తం 4976 హైస్కూళ్లు ఉండగా, అందులో 3428 స్కూళ్లను సక్సెస్ స్కూళ్లుగా గుర్తించారు. స్కూళ్లలో 13,39,180 మంది విద్యార్ధులు చేరగా, అందులో ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో 4,20,066 మంది ఇంగ్లీషు మీడియంలో చేరారు. స్కూళ్ల వారీ చూసుకుంటే 1647 స్కూళ్లలో నూరు శాతం అడ్మిషన్లు జరగ్గా, మరో 1781 స్కూళ్లలో కొంచెం తక్కువగా విద్యార్ధులు చేరారు. అంటే సక్సెస్ స్కూళ్లలో చేరిన వారిలో 31.36 వాతం మంది ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న వారే.