ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 10:ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర రెవెన్యూ లోటు 14 వేల కోట్ల రూపాయలకు, ద్రవ్య లోటు 24 వేల కోట్ల రూపాయలకు చేరుకుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. రెవెన్యూ, ద్రవ్యలోటు భర్తీ ప్రభుత్వం ముందున్న సవాల్ అన్నారు. 2017-18 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా వెలగపూడి సచివాలయంలో వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులతో మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు 4800 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా వేశామని, కానీ అది 14,134 కోట్ల రూపాయలకు చేరిందన్నారు. ద్రవ్య లోటు కూడా 20,490 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా వేశామని, కానీ 24 వేల కోట్ల రూపాయలకు చేరిందన్నారు. రెవెన్యూ కింద ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం వల్ల రెవెన్యూ లోటు పెరిగిందన్నారు. ఇది బడ్జెట్‌లో 3.5 శాతానికి చేరిందన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిధి కింద రెవెన్యూ లోటు 3 శాతం మించకూడదని, కానీ 3.5 చేరడమంటే చాలా ఎక్కువన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌ఆర్‌బిఎం శాతాన్ని నాలుగు శాతానికి పెంచాలని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిని కోరామని చెప్పారు. దీనివల్ల రాష్ట్రానికి రుణం పొందే వీలు ఎక్కువ అవుతుందని, కొంతమేరకు లోటును అధిగమించే వీలు కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్ 1,35 లక్షల కోట్ల రూపాయలు కాగా, ఇప్పటికే 94 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. అదనంగా 22,163 కోట్ల రూపాయల మేరకు అదనంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయన్నారు. రెవెన్యూ, ద్రవ్య లోటును పూరించడమే ప్రభుత్వం ముందున్న సవాలన్నారు. కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద 51 వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 36 వేల కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్ నెలతో పోలిస్తే, డిసెంబర్ నెలలో 7 శాతం మేర ఆదాయం తగ్గిందన్నారు. పన్నులు పెంచకుండా లోటును భర్తీ చేయడంపై దృష్టి సారించామన్నారు. జిఎస్‌టి వల్ల తొలినాళ్లలో అంత మేలు జరగకపోయినా, తరువాతి కాలంలో మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలపై భారం మోపకుండా ప్రజా బడ్జెట్‌ను రూపొందించేందుకు అన్ని చర్యల తీసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో దాదాపు 4000 కోట్ల రూపాయల మేర ఇళ్ళ నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని మాంత్రి యనమల తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణంపై జియో ట్యాగింగ్ సహకారంతో సర్వే చేపట్టగా, 14 లక్షల ఇళ్లు కనిపించలేదని, లబ్ధిదారులు లేకుండానే చెల్లింపులు జరిగాయని విమర్శించారు.