జాతీయ వార్తలు

అదిరేలా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని హైదరాబాద్ కంటే పెద్దగా, మెరుగైన పట్టణంగా నిర్మిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోనే అత్యుత్తతమైన నగరంగా దీన్ని తీర్చిదిద్దుతానని 2024లో హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా మారేనాటికల్లా ఈ లక్ష్యాన్ని సాధిస్తానని ఉద్ఘాటించారు. ఇండియా టుడే పత్రిక దక్షిణాది శిఖరాగ్ర సదస్సుకు హాజరైన చంద్రబాబు ఆ పత్రిక కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో మంగళవారం మాట్లాడారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని నిర్ణయించారని చెప్పారు. అమరావతిని అన్ని విధాలుగా ఉత్తమమైన, మెరుగైన నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామన్నారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటు, దీన్ని ప్రపంచ స్థాయి పట్టణంగా మార్చడం, మానవ వనరుల అభివృద్ధి అన్నవి తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని చంద్రబాబు చెప్పారు. ఏ నగర అభివృద్ధికైనా అత్యంత ప్రాథమికమైన ఈ మూడింటిని సమకూరిస్తే..మిగతావి వాటంతట అవే సమకూరుతాయన్నారు. ‘ప్రజలు నన్ను నిరంతరం గుర్తుంచుకునేలా అమరావతిని నిర్మిస్తా. ఆంధ్ర ప్రదేశ్‌ను దేశానికే తిరుగులేని అభివృద్ధి నమూనాగా మారుస్తా’నని చంద్రబాబు అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశానికే ఎంతో మంచిదన్నారు. తమ రాష్ట్రంలో నగదు కొరత లేదని, 90శాతం మంది ప్రజలు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. కేవలం ఐదు నుంచి పదిశాతం మంది మాత్రమే దీనికి వ్యతిరేకమని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీతో తన సంబంధాల గురించి మాట్లాడిన చంద్రబాబు కొన్ని సందర్భాల్లో ఆలోచనల్లో విభేదాలున్నా దేశ సమగ్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంటుందన్నారు. దేశంలో తొలిసారిగా వాజపేయి సారధ్యంలో ఏర్పడ్డ ఎన్డీయే ప్రభుత్వంలో మీరు పనిచేశారు కదా..ప్రధాన మంత్రులుగా వాజపేయి, నరేంద్ర మోదీల్లో ఎవరు సమర్థులన్న ప్రశ్నకు ‘ఎవరి ఆలోచనా విధానం వారిది. వీరిద్దరినీ పోల్చడానికి వీల్లేదు’అని జవాబిచ్చారు. ’ది గ్రేట్ డిజిటల్ లీప్’అన్న అంశంపై చంద్రబాబు మాట్లాడారు.

చిత్రం... ఇండియా టుడే శిఖరాగ్ర సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్