జాతీయ వార్తలు

పంజాబ్ ‘ఆప్’ సిఎం అభ్యర్థి కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సిఎం కావాలని కలలు కంటున్నారు. అయితే ఆయన ఆలోచనే ఇపుడు వివాదాస్పదమైంది. కేజ్రివాల్ ఢిల్లీనుంచి పారిపోతున్నారా? అంటూ కాంగ్రెస్, బిజెపిలు విమర్శలకు తెరలేపాయ. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి మెజారిటీ లభిస్తే కేజ్రీవాల్ ఢిల్లీ సిఎం పదవికి రాజీనామా చేసి పంజాబ్ సిఎం పదవి చేపట్టాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన ఆమ్ ఆద్మీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా మంగళవారం మొహాలీలోని ఒక ర్యాలీలో సంచలన ప్రకటన చేశారు. పంజాబ్ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో అకాలీదళ్- బిజెపి కూటమి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ సిఎం అభ్యర్థి అవుతాడనుకున్న ఎంపీ భగవాన్ సింగ్ వివాదాల్లో చిక్కుకోవడంతో కేజ్రీవాల్ స్వయంగా పార్టీ సిఎం అభ్యర్థి అవతారం ఎత్తటం ద్వారా పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్, బిజెపిలు ఆరోపిస్తున్నాయ. సిఎంగా ఢిల్లీకి ఏమీ చేయలేని కేజ్రీవాల్, పంజాబ్‌లో ఏం వెలగబెడతాడని ప్రశ్నిస్తున్నారు. కేజ్రీవాల్ ఢిల్లీనుంచి పారిపోతున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ మొదట ఢిల్లీ సిఎం పదవికి రాజీనామా చేసి, తరువాత పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ సిఎం అభ్యర్థిగా పోటీచేయాలని వారు సవాల్ చేశారు.