ఆంధ్రప్రదేశ్‌

44 శాతం పెరిగిన విమాన ట్రాఫిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో పౌర విమానయాన ట్రాఫిక్ 44 శాతం వృద్ధిరేటు సాధించింది. విశాఖపట్నంలో 2016-17లో 20 లక్షల మంది ప్రయాణికులు విమాన సేవల్ని వినియోగించుకున్నారు.
విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణీకుల వృద్ధిరేటు 76 శాతం నమోదైంది. దీనికి రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన కొత్త పౌర విమానయాన విధానం, ఏరోస్పేస్, రక్షణ మాన్యుఫ్యాక్చరింగ్ విధానాలు కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈనెల 12న విజయవాడ విమానాశ్రయంలో కొత్త టర్మినల్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌లో పౌర విమానయాన రంగంలో సాధించిన అభివృద్ధిని సిఎం సమీక్షించారు. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయాల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఒక ఏడాది కాలంలోనే విజయవాడ విమానాశ్రయంలో కొత్త టర్మినల్ పనులు పూర్తయ్యాయన్నారు. ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై పన్నును ఒక శాతం తగ్గించటం వల్ల రాష్ట్రంలో పౌర విమానయాన రంగం ఊపందుకుందన్నారు. విజయవాడలో కొత్త ఇంటీరియమ్ టర్మినల్‌ను రూ.135 కోట్ల నిర్మించామన్నారు. రన్‌వే పొడువు 2286 మీటర్లకు పెంచామన్నారు. ఏ-320, ఏ-321 ఎయిర్ క్రాఫ్ట్‌లు కూడా విజయవాడ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యేందుకు అనువుగా రన్‌వేను పెంచామన్నారు. రాత్రి వేళల్లో కూడా విమానాలు ల్యాండయ్యేందుకు సదుపాయాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 4.2 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసేవిధంగా సదుపాయాలు ఉన్నాయన్నారు. త్వరలోనే విజయవాడను ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు స్థాయి హోదా కల్పించేందుకు వీలుగా 3900 మీటర్లకు రన్‌వేను పెంచనున్నారు. దీనికోసం రూ. 600 కోట్లపెట్టుబడులను పెట్టనున్నామని అజయ్ జైన్ తెలిపారు. 2015 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో 16,91,448 మంది ప్రయాణికుల ట్రాఫిక్ ఉండగా, 2016 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 24,28,612 మంది ప్రయాణికుల ట్రాఫిక్ పెరిగింది.