రాష్ట్రీయం

ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక జాతీయ సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: దేశంలో ప్రవేశ పరీక్షల నిర్వహణకు ప్రత్యేక జాతీయ సంస్థ ఏర్పాటు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రతి ఏటా వెయ్యివరకూ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంటే, అందులో ప్రతి విద్యార్ధి ఉన్నత చదువులకు కనీసం అరడజను పరీక్షలకు హాజరుకావల్సి వస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలను వేర్వేరు సంస్థలు నిర్వహిస్తున్నాయి. దానివల్ల విద్యార్ధులకు సైతం లేనిపోని గందరగోళం ఏర్పడుతోంది. ఈ క్రమంలో అన్ని రకాల యుజి, పిజి కోర్సులకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించడంతోపాటు వాటి నిర్వహణకు అమెరికా ఇటిఎస్ (ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్) తరహాలో నేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఎన్‌టిఎస్)ను ఏర్పాటు చేయాలనే యోచనలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఉంది. ఈమేరకు ప్రతిపాదలను సిద్ధం చేసి కేంద్ర మంత్రిమండలికి పంపించింది. ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్కిటెక్చర్ తదితర స్పెషలైజ్డ్ కోర్సులకు ఆయా అంశాలపై ప్రత్యేక పేపర్ అదనంగా ఉంటుంది. ఇంగ్లీషుతోపాటు ఆప్టిట్యూడ్ పేపర్లు కామన్‌గా ఉంటాయి. అమెరికాలో ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ సంస్థ తరహాలోనే నేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ పనిచేస్తుంది. దేశంలో కేట్, జెఇఇ, గేట్, సి మేట్, నీట్, నెట్ తదితర పరీక్షలకు 40 లక్షలమంది హాజరవుతున్నారు. వీటికితోడు ఆయా రాష్ట్రాలు తమ యూనివర్శిటీల్లో అడ్మిషన్లకు వేర్వేరు పేర్లతో ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. సిబిఎస్‌ఇ, ఎఐసిటిఇ వంటి నియంత్రణా మండళ్లున్నా, అవి జాతీయస్థాయిలో ప్రవేశపరీక్షల నిర్వహణ స్థాయికి అందుకోలేకపోయాయని, అమెరికాలో ఇలాంటి బాధ్యతలను ఇటిఎస్ నిర్వహిస్తోందని, అదే తరహాలో భారత్‌లో కూడా ఒక సంస్థ ఏర్పాటు అవసరమని కేంద్రం గుర్తించిందని మానవ వనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 1986లో వచ్చిన జాతీయ విద్యా విధానంలో కూడా ఇందుకు సంబంధించిన ప్రస్తావన ఉన్నా ఇంతవరకూ అలాంటి ప్రయత్నాలు జరగలేదు. జెఇఇ పరీక్ష సమీక్షకు నియమించిన అశోక్ మిశ్రా కమిటీ, నేషనల్ నాలెడ్జి కమిషన్‌లు సైతం ఎన్‌టిఎస్ ప్రతిపాదన చేశాయి. సిబిఎస్‌ఇ ఇప్పటికే జెఇఇ మెయిన్స్, యుజిసి నెట్, నీట్ పరీక్షలతో సతమతమవుతోంది. వచ్చే ఏడాదినుండే ఎన్‌టిఎస్ జాతీయ పరీక్షలు నీట్, జెఇఇ, గేట్, యుజిసి నెట్ వంటి నిర్వహణ బాధ్యతలను తలకెత్తుకోనుందని తెలిసింది.