రాష్ట్రీయం

నగరాల్లో మల్టీలెవల్ పార్కింగ్‌కు ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: కాలుష్య నివారణకు పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎల్‌పిజి, సిఎన్‌జి వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఓవర్ లోడింగ్ వాహనాలను నియంత్రించాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కూడా అయిన రాజీవ్ శర్మ సచివాలయంలో బుధవారం రవాణా, పౌరసరఫరా, పోలీస్, మున్సిపల్ ఉన్నతాధికారులతో రాజీవ్ శర్మ సమావేశమయ్యారు. కాలుష్య నివారణకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను ఆయన సమీక్షించారు. కాలుష్య నివావరణకు సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా రాష్ట్రంలో అమలు జరగడానికి చర్యలు తీసుకోవాలని రాజీవ్ శర్మ ఆదేశించారు. కాలుష్య కారక ప్రాంతాలుగా గుర్తించిన వాటిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. వాయు కాలుష్యం, వాహన కాలుష్యంపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని నియంత్రించి, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరుచడానికి చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ నగరంలో వాహన కాలుష్యం రోజు, రోజుకు పెరిగిపోతుండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజిమెంట్ సిస్టమ్‌ను తప్పని సరిగా అమలు చేయాలని రాజీవ్ శర్మ ఆదేశించారు. మల్టీలేవల్ పార్కింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి పరుచాలని, ముఖ్యంగా వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలలో వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రీన్ బఫర్స్, సిటీ గ్రీనింగ్‌తో పాటు రోడ్ల విస్తరణను చేపట్టాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. సేకరించిన వ్యర్థ పదర్థాలను దహనం చేయడం వల్ల తీవ్ర వాయు కాలుష్యం ఏర్పాడుతుందని, ఎక్కడా అలాంటివి జరుగకుండా ఆకస్మీక తనఖీలు నిర్వహించాలన్నారు. ఇంధన కల్తీ కాలుష్యానికి ప్రధాన కారణమని, ఇంధన కల్తీని అరికట్టడానికి పౌరసరఫరాలశాఖ చర్యలు చేపట్టాలని రాజీవ్ శర్మ ఆదేశించారు. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి బిఆర్ మీనా, రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, పౌరసరఫరాలశాఖ కమిషనర్ సివి ఆనంద్, మున్సిపల్ పాలనా, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.