ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగులకు సంక్రాంతి కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 11: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా కరవు భత్యం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరిన వెంటనే సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాల జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్‌బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బుధవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాస గృహంలో కలిశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సమస్యలైన కరవు భత్యం మంజూరు, హెల్త్‌కార్డుల అమలు, కాంట్రాక్ట్, కంటింజెన్సీ ఉద్యోగాల క్రమబద్ధీకరణ వంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం బకాయి ఉన్న రెండు విడతల కరవు భత్యాన్ని సంక్రాంతి కానుకగా మంజూరు చేయాలని, హెల్త్‌కార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంత జాప్యం జరిగిందని, కరవు భత్యం మంజూరుపై ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. కరవు భత్యాన్ని మార్చి నెల నుండి నగదు రూపంలో చెల్లించే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన హెల్త్‌కార్డుల ద్వారా వైద్య సహాయం అందించడంలో ఎదురవుతున్న సమస్యలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ సమస్యను పరిష్కరించేందుకు ఈ నెల 12న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాల్సిందిగా ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారన్నారు.