రాష్ట్రీయం

ఎన్టీఆర్ అమరావతి ఎయిర్‌పోర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 12: రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాలుండగా రానున్న రోజుల్లో ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటుకు కేంద్రం చొరవ చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు ముందస్తుగా శాశ్వత టెర్మినల్ నిర్మించాలని కోరారు. కార్గో సర్వీసులు కూడా ప్రవేశపెట్టాలని కోరారు. గన్నవరం విమానాశ్రయానికి ‘ఎన్టీఆర్ అమరావతి’ విమానాశ్రయంగా నామకరణం చేయాలంటూ హర్షధ్వానాల మధ్య చంద్రబాబు కోరారు. రూ.160 కోట్లతో నిర్మితమైన అధునాతన టెర్మినల్ భవనానికి ప్రారంభోత్సవం, మరో రూ.160 కోట్లతో చేపట్టబోయే రన్‌వే విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు గురువారం ఆర్భాటంగా జరిగాయి. ఈ రెండు ముఖ్య కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు పి అశోక్ గజపతిరాజు, ఎం వెంకయ్యనాయుడు, వై సుజనాచౌదరి, బండారు దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తాను ఎంతో శ్రమించి శంషాబాద్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశానన్నారు. రన్‌వే విస్తరణకు 750 ఎకరాల భూములు ఇచ్చిన రైతులెవ్వరూ ఏమాత్రం నష్టపోకుండా అన్నివిధాలా పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నానికి బదులుగా దగదర్తిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ మరో రెండేళ్లలో ఇక్కడ శాశ్వత టెర్మినల్‌ను నిర్మించి ఈ కొత్త టెర్మినల్‌ను సరకు రవాణాకు ఉపయోగిస్తామని చెప్పారు. విమానయాన రంగంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మూడు రెట్ల ప్రయాణికులు ఒక్క ఎపిలోనే ఉన్నారని తెలిపారు. సభలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు మాట్లాడారు. నిర్ణీత సమయానికే టెర్మినల్‌ను పూర్తిచేసినందుకు చంద్రబాబు తొలుత కాంట్రాక్టర్‌ను, ఏవియేషన్ అధికారులను సత్కరించారు.

చిత్రం..గురువారం గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు