రాష్ట్రీయం

1999 గ్రూప్-2 మెరిట్ లిస్టును కొట్టివేసిన ట్రిబ్యునల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: న్యాయస్థానాల్లో వివాదాలు, సుదీర్ఘకాలం పాటు విచారణలు, ఉన్నత న్యాయస్థానం తీర్పు అనంతరం 17 ఏళ్ల తర్వాత ప్రకటించిన 1999 గ్రూప్-2 అదనపు మెరిట్ లిస్టును రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. ఈ తీర్పు రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న గ్రూప్-2 కేడర్ 1999 బ్యాచ్ అభ్యర్థులపై ప్రనావం చూపనుంది. 1075 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 296 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఎపిపిఎస్‌సి ఇచ్చిన జాబితాను ట్రిబ్యునల్ కొట్టేసిందని గతంలో ఎంపికైన అభ్యర్థుల తరఫు న్యాయవాది నరసింహ తెలిపారు. తాజా జాబితాతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా 150 మందికి ఉద్యోగాలు రాగా, ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు 40 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. అలాగే ఉన్నత స్థానాల్లో నుంచి కింది స్థాయికి కొంతమంది రావల్సి ఉండటం, జోన్లలో మార్పులువంటి చిక్కుముడులు ఏర్పడ్డాయి. మరోపక్క రాష్ట్ర విభజనతో ఆంధ్రాలో పనిచేస్తున్న వారు తెలంగాణకు, తెలంగాణలో పనిచేస్తున్నవారు ఆంధ్రాకు మారాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. రూల్ -7 ప్రకారం లెఫ్ట్ ఓవర్ మెరిట్ జాబితాలోని తర్వాతి స్థానాల వారికి అవకాశం కల్పిస్తామని కమిషన్ అధికారులు చెప్పినా, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో దాదాపు 250 పోస్టులకు సంబంధించి అప్పటి ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తర్వాత వివిధ వడపోత ప్రక్రియల అనంతరం నియామకాలు చేసింది. ఆ తర్వాత అదే నోటిఫికేషన్‌లో మరో 973 పోస్టులను చేర్చి మెరిట్ జాబితాలోని అభ్యర్థులతో భర్తీ చేసింది. మరోసారి 111 పోస్టులను మళ్లీ అదే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేశారు. అయితే ఈ నియామకాల్లో మొదట పోస్టింగ్‌లు పొందిన వారు కొందరు కోర్టును ఆశ్రయించారు. తాము మెరిట్‌లో ఉన్నా తమకు సరైన పోస్టులు రాలేదని, తర్వాత చేపట్టిన నియామకాల్లో తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన వారికి మంచి పోస్టులు వచ్చాయని వాదించారు. దీంతో మూడు విడతల పోస్టులు కలిపి కామన్ మెరిట్ జాబితాను రూపొందించి నియామకాల్లో జరిగిన తప్పులను సరిదిద్దాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే కొంత మంది పదేళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసి పదోన్నతులు కూడా పొందారని, అలాంటపుడు ఉమ్మడి జాబితాను ఎలా రూపొందించాలనేదానిపై న్యాయవివాదాలు మరోసారి తలెత్తాయి. కొంత మంది అభ్యర్థులకు మాత్రం ఆప్షన్లు కోరి, ముందుగా ఉద్యోగాలు పొందిన తమను మాత్రం ఆప్షన్లు కోరలేదని కొంత మంది అభ్యర్థులు వాపోయారు. ఈ పరిస్థితుల్లో ట్రిబ్యునల్ ఆదేశాలు సరికొత్త వివాదాలకు తెరతీసింది.