రాష్ట్రీయం

ఏప్రిల్ చివరలో ఏపి ఎమ్సెట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: ఆంధ్రప్రదేశ్ ఎమ్సెట్ ప్రవేశపరీక్షను తెలంగాణ నిర్వహించిన రోజునే నిర్వహించాలని తొలుత భావించినా, తెలంగాణ కంటే ముందే ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్సెట్ నిర్వహణకు అధికారులు మూడు తేదీలు సూచించినట్టు తెలిసింది. ఏప్రిల్ 23, 25, 27 తేదీల్లో ఏదో ఒక రోజు ప్రవేశపరీక్షను నిర్వహించనున్నారు. ప్రవేశపరీక్షలను గత ఏడాది నిర్వహించిన వర్శిటీలకే అప్పగించనున్నారు. ఎమ్సెట్‌ను కాకినాడ జెఎన్‌టియుకు అప్పగిస్తారు. ఇసెట్ నిర్వహణను అనంతపురం జెఎన్‌టియుకు, ఐసెట్‌ను ఆంధ్ర యూనివర్శిటీకి, ఎడ్‌సెట్‌ను తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీకి, పిజి ఇసెట్‌ను కాకినాడ జెఎన్‌టియుకు, లాసెట్‌ను అనంతపురం కృష్ణదేవరాయ వర్శిటీకి, పిజి లాసెట్‌ను కూడా అనంతపురం కృష్ణదేవరాయ వర్శిటీకి, పిఇ సెట్‌ను గుంటూరు ఆచార్య నాగార్జున వర్శిటీకి అప్పగించనున్నారు. ఎమ్సెట్‌ను ఏప్రిల్‌లో నిర్వహించినా మిగిలిన అన్ని ప్రవేశపరీక్షలను మే నెలలోనే పూర్తి చేస్తారు. షెడ్యూలును ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాత విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తేదీలు ఖరారై దాదాపు 20 రోజులైనా, కొత్తగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ నియమితులు కావడంతో ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేయనున్నారు.