రాష్ట్రీయం

గడ్డకట్టే చలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: రాష్ట్రాన్ని చలి వణికేస్తోంది. మునె్నన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. మూడు నాలుగు రోజులుగా చలితో గజగజలాడుతున్న రాష్ట్రం, మరో వారంపాటు అంతకంటే ఎక్కువ శీతలగాలులు ఎదుర్కొక తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 14 నుంచి 20 వరకు ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే వారం రోజుల్లో రాష్ట్రంలోని 16 జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 8 నుంచి 12 సెంటిగ్రేడ్ ఉంటుందని, కొన్నిచోట్ల సాధారణం ఉష్ణోగ్రతలు పడిపోయి మైనస్ 3 నుంచి మైనస్ 4 సెంటిగ్రేడ్‌కు దిగిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, మెదక్, సిద్ధిపేట, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో తీవ్రమైన చలి గాలులు ఉంటాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ నాలుగు సెంటిగ్రేడ్ కంటే కిందకు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కాస్త మెరుగుగా చలి ఉండే 15 జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రత 10 నుంచి 14 సెంటిగ్రేడ్ ఉంటుందని, ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ 2 నుంచి మైనస్ 3కు పడిపోయే అవకాశం ఉందని వాతవరణ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.