రాష్ట్రీయం

పందెంరాయుడి అత్యుత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 13:పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని కోడిపందాల బరివద్ద ఖమ్మం జిల్లాకు చెందిన ఒక పందెంరాయుడు అకస్మాత్తుగా గాలిలోకి కాల్పులు జరిపి, లేనిపోని ఉద్రిక్తత సృష్టించాడు. అతన్ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని, సంఘటన స్థలంనుంచి తరలించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి గంగవరపు లక్ష్మిదయాకర్ తన అనుచరులతో కలిసి, కోడి పందాలు చూసేందుకు శ్రీనివాసపురం వచ్చాడు. పందాల్లో తొలిగా నిర్వహించే దేవుడు పందెం ముగిసిన వెంటనే సాధారణ పందాలు ప్రారంభమయ్యాయి. ముందుగా రూ.లక్ష, రూ.రెండు లక్షలు, రూ.50 వేల పందాల ఖరారుకు సంప్రదింపులు జరిగాయి. ఆ సమయంలో లక్ష రూపాయల పందాలు ఖరారయ్యాయి. ఈ ఉత్సాహంలో దయాకర్ ఒక్కసారిగా తన జేబులో ఉన్న 7.65 ఎంఎం లైసెన్స్‌డ్ పిస్టల్ తీసి, మూడురౌండ్లు గాలిలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అంతా నిర్ఘాంతపోయారు. ఈ విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం డిఎస్పీ వెంకట్రావు సిబ్బందితో అక్కడకు చేరుకుని, దయాకర్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న పిస్టల్, ఏడు రౌండ్ల బుల్లెట్లు, రూ.1.64 లక్షల నగదు, జీపును స్వాధీనం చేసుకున్నారు. దయాకర్ వద్ద ఉన్న పిస్టల్ లైసెన్సుకు 2017 వరకు కాలపరిమితి ఉన్నట్లు గుర్తించారు.

చిత్రం..కోడి పందాల బరివద్ద కాల్పులు జరుపుతున్న దయాకర్