రాష్ట్రీయం

నగదు రహితంలో టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, జనవరి 15: నగదు రహిత లావాదేవీల్లో ఇప్పటికే రాష్ట్రం ముందంజలో ఉందని, మార్చి నాటికి పూర్తిస్థాయిలో ప్రజలంతా నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడేలా దృష్టి సారిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో తన సొంత ఊరు నారావారిపల్లెలో గడపడానికి ఈనెల 13వ తేదీన కుటుంబ సమేతంగా చంద్రబాబు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన స్వగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 40 శాతం మంది నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడ్డారన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం ముందుందన్నారు. మార్చి మాసాంతానికి పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నది లక్ష్యమన్నారు. ఇక వైకుంఠమాల పేరుతో చిత్తూరు జిల్లాలోని అన్ని దేవాలయాలను కలిపేవిధంగా రూట్‌మ్యాప్‌ను తయారుచేస్తామన్నారు. తాను అందరికీ చెప్పేది ఒకటేనని అమ్మను, జన్మభూమిని, తెలుగు భాషను రాష్ట్ర ప్రజలు మరువకూడదన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్‌ను అనుసంధానం చేయడంతో అర్హత కలిగిన లబ్ధిదారులు సంక్షేమ పథకాలను పొందగలుగుతున్నారని తెలిపారు. ఈ సంక్రాంతి నుంచి నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ 15 అంశాలతో కుటుంబ వికాసం, సమాజ వికాసం లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. పశువుల కోసం ప్రత్యేక హాస్టళ్లు నిర్వహించబోతున్నట్టు చెప్పారు. అక్కడే పశుపోషణ జరుగుతుందన్నారు. రైతులు తమ వ్యవసాయ పనులకోసం పశువులను తీసుకెళ్లి, మళ్లీ హాస్టల్‌కు అప్పగించొచ్చన్నారు. గాలేరు-నగరి రెండో దశ పనులకు శ్రీకారం చుడుతున్నామని దీని ద్వారా మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్లకు నీరు సంమృద్ధిగా చేరుతుందని అన్నారు. 15 ఎంబిపిఎస్ ఫైబర్ కనెక్టివిటీని అందిస్తామని తద్వారా ప్రతి ఇల్లు ఒక విజ్ఞాన నిలయంగా మారుతుందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు తమిళనాడు సిఎం పన్నీర్ సెల్వంతో కూడా చర్చించామని వెల్లడించారు. తొలుత సిఎం ఆంధ్రాబ్యాంకు ఎటిఎంను ప్రారంభించారు. 7 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

చిత్రం..ఆదివారం విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు