రాష్ట్రీయం

డ్రోన్‌ల పర్యవేక్షణతో పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 15: ప్రభుత్వంలోని పదహారు విభాగాల్లో డ్రోన్ల సేవలు ఇక అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ అధీనంలోని వివిధ శాఖల్లో డ్రోన్ల వినియోగానికి కేంద్ర హోంశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలో ఆయాశాఖల్లో డ్రోన్ల ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దేశంలో డ్రోన్ల వినియోగంపై 2014లో కేంద్రం కొన్ని ఆంక్షలు విధించింది. అనుమతి లేని వ్యక్తులు, సంస్థలు డ్రోన్లను ఉపయోగించడం వల్ల దేశ భద్రతకు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అయితే వివిధ ప్రభుత్వ సంస్థలు డ్రోన్ల వినియోగానికి అనుమతులు కోరినప్పుడు వాటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు మంజూరు చేస్తున్నారు. నిరుడు జరిగిన కృష్ణా పుష్కరాల్లో డ్రోన్లను వినియోగంతో మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఆయా శాఖల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ల వినియోగాన్ని పూర్తిస్థాయిలో చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. పర్యాటక, అటవీ, నీటి పారుదల, పురపాలక, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయం, ట్రాఫిక్, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, తదితర రంగాల్లో డ్రోన్ల సేవలు వినియోగించాలని తలపెట్టారు. వీటి నిర్వహణ, తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. అవసరమైతే డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా భావించారు. నాలుగు జిల్లాల్లో విస్తరించిన ఎర్రచందనం దందాపై నిఘా ఉంచేందుకు, పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణంపై పర్యవేక్షణ, పంటలపై ఎరువులు, పురుగుమందుల పిచికారీ, తదితర అంశాల్లో డ్రోన్లను వినియోగించడం వల్ల రియల్‌టైమ్‌లో పరిస్థితిని అంచనా వేసే వీలుంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో 16 శాఖల పరిధిలో డ్రోన్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం అనుమతి కోరింది. ఈమేరకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో డ్రోన్ల కొనుగోళ్లు, నిర్వహణ, నియంత్రణ, తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుందని అధికార వర్గాలు తెలిపాయి.